Aug 08,2021 07:36

కోల్‌కతా: విద్యుత్‌ సవరణ బిల్లు-2020ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులను వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీకి పశ్చిమబెంగాల్‌ సిఎం మమత బెనర్జీ శనివారం ఒక లేఖ రాశారు. ఈ బిల్లు ప్రజావ్యతిరేక బిల్లు అని, దీనిని తక్షణం ఉపసంహ రించుకోవాలని లేఖలో డిమాండ్‌ చేశారు. ప్రతిపాదిత సవరణలపై విస్తృతమైన, పారదర్శకమైన చర్చలను ప్రారంభించాలన్నారు. గతేడాదే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేసిందని మమత గుర్తుచేశారు. ముసాయిదా బిల్లులోని ప్రజావ్యతిరేక విధానాలను ఆ సమయంలో అనేకమందిని తెలిపారు. ఇదే అంశంపై గతేడాది జూన్‌ 12న లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అదే బిల్లును మళ్లీ తీసుకురావడంపై మమత అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ హక్కులు కేంద్రానికి కట్టబెట్టేలా ఉన్న ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.