
ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి - మొగల్తూరు
మొగల్తూరులోని అబ్రహ ంపేటలో విద్యుత్ స్తంభం సమస్యను సోమవారం ఆ శాఖ అధికారులు పరిష్కరించారు. విద్యుత్ స్తంభం ఒక పక్కకు ఒంగి ప్రమాదకరంగా ఉండడంపై ప్రజాశక్తిలో ప్రచురితమైన కథనానికి సంబంధిత శాఖాధికారులు స్పందించారు. ఎలక్ట్రికల్ ఎఇ శివప్రసాద్ పర్యవేక్షణలో లైన్ ఇన్‌స్పెక్టర్ వేండ్ర పెద్దిరాజు పర్యవేక్షణలో సిబ్బంది విద్యుత్ స్తంభం సమస్య పరిష్కరించారు.