Feb 14,2023 22:00

వినతి పత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు

విద్యుత్‌ స్తంభాలను సరి చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి - నందికొట్కూరు

మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్‌ఆర్‌ నగర్‌లోని సిపిఎం కొట్టాల్లో కూలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను వెంటనే సరి చేయాలని మంగళవారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం కార్యాలయం నుండి ర్యాలీగా ఏడిఏ కార్యాలయం చేరుకొని ధర్నా చేశారు.
సిఐటియు టౌన్‌ కార్యదర్శి టి.గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి వెంకటేశ్వర్లు, కే భాస్కర్‌ రెడ్డి, ఫకీర్‌ సాహెబ్‌ మాట్లాడారు. బిఆర్‌ఆర్‌ నగర్‌లో గత 15 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న గుడిసెల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెల్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు నేలకు వరగడంతో విద్యుత్‌ వైర్లు క్రిందకు వేలాడుతూ గాలికి వైర్లు తగులుకొని విద్యుత్‌ వైర్ల నుంచి మంటలు రావడంతో గుడిసేవాసులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు ఎప్పుడు ప్రజలపై పడుతూనని భయంతో బతుకుతున్నా రన్నారన్నారు. తక్షణమే నేలకు ఒరిగిన విద్యుత్‌ స్తంభాలను సరిచేయాలని విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఇంతవరకు ఏ అధికారి పట్టించు కోవడంలేదని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడపగడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు తోగురు ఆర్థర్‌ పర్యటన సందర్భంగా విద్యుత్‌ స్తంభాలను చూసి వెంటనే ఈ స్తంభాలను సరిచేయాలని ఎమ్మెల్యే చెప్పి రెండు నెలలు అవుతున్న విద్యుత్‌ అధికారులు ఎమ్మెల్యే మాటలను బేఖాతర్‌ చేస్తున్నారని అన్నారు. అనంతరం సమస్యల తో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వేణుగోపాల్‌, టి ఓబ్లేస్‌, సిఐటియు రూరల్‌ కార్యదర్శి సి నాగన్న, మహిళా సంఘం నాయకులు ఎస్‌ బేబీ, నూర్జహాన్‌, కాలనీవాసులు లక్ష్మీదేవి, ఎరుకల నాగమ్మ, లక్ష్మి, నాగలక్షమ్మ, వెంకటేశ్వరమ్మ, సుబ్బమ్మ, సీతారాముడు, మధు బాబ తదితరులు పాల్గొన్నారు.