విద్యుత్ సరఫరా వేళలు మార్పు చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు చేయాలని మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో రైతు సంఘ నాయకులతో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్న విద్యుత్ వేళలను మార్పు చేయాలని డిమాండ్ చేశారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో మోటార్ల ఆధారంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారన్నారు. ప్రసుత్తం ఒకవారం 8.30 గంటలకు, మరోవారం 9.30 గంటలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారని వర్షాభావ పరిస్థితుల కారణంగా నేల, బోరుబావుల్లో ఉన్న నీరు మధ్యాహ్న సమయానికే అడుగంటడంతో పంటలు నష్టం జరుగుతుందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక వారం ఉదయం 6 మరోవారం ఉదయం 7 గంటలకు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ వేళల్లో మార్పులు చేసి రైతులను ఆదుకోవాలని తెలియజేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.










