Nov 18,2023 00:22

ప్రజాశక్తి - చీరాల
విద్యుత్తు సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి విద్యుత్ అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వివిధ  శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని 31వ వార్డులో ఆ ప్రాంత అవసరాల మేరకు ఆరు విద్యుత్ స్థంభాలు త్వరగా ఏర్పాటు చేయాలని అన్నారు. 13వ వార్డులో ఏడాది కాలంగా చెబుతున్న కరెంట్ స్థంబాలు వేయలేదని వైస్‌ఛైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు అన్నారు. సిబ్బంది లేరని సిబ్బంది చెబుతున్నారని అన్నారు. తమ వార్డు యువకులు అధికారులకు సాయంగా ఉంటారని అన్నారు. స్థంబాలు వేయమన్నా నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు ఎంఎల్‌ఎ దృష్టికి తెచ్చారు. క్రిస్మస్ వస్తున్నందున త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. శృంగారపేట, పాపాయిపాలెం, కీర్తివారిపాలెం రోడ్డులో, ఈపురిపాలెం ప్రాంతాలలో విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని అన్నారు. చీరాలనగర్‌లో ఇటీవల పిల్లలకు ప్రమాదం జరిగిందని, అక్కడ విద్యుత్‌ స్థంభాలు మార్చాలని ఫోనులో మహిళా సమస్య విన్న ఎంఎల్‌ఎ బలరాం విద్యుత్ అధికారులను తక్షణం అక్కడ సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. జగనన్న కాలనీ నిర్మాణాలు, పంచాయతీ అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపి పట్టణ అధ్యక్షులు గుంటూరు మాధవరావు, వైసిపి చీరాల మండలం అధ్యక్షులు ఆసాది అంకాలరెడ్డి, వైసిపి వేటపాలెం మండలం అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, జిల్లా వ్యవసాయ సలహా మండల సభ్యులు పులి వెంకటేశ్వర్లు, వైసిపి ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సల్లూరి అనిల్, వైసిపి వాణిజ్య విభాగ జిల్లా అధ్యక్షులు చీమకుర్తి బాలకృష్ణ, పిఎసిఎస్ చైర్మన్ బోయిన కేశవులు, ఆర్‌బికె చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, మునిసిపల్ కౌన్సిలర్లు, ఎంపిడిఓ నేతాజీ, విద్యుత్ ఈఈ కె థామస్ జాని, ఎడిఎలు టి శ్రీనివాసులు, ఎ శ్రీనివాసరావు, పంచాయితీ రాజ్ డిఇ ఎల్ శేషయ్య, మునిసిపల్ డిఈ ఐసయ్య, ఆర్‌డబ్లుఎస్ డిఈ సతీష్ చంద్ర, ఏఈలు రామ్ కుమార్, కాలేషా బాబు, విద్యుత్ ఏఈలు బ్రహ్మం, భాస్కర్, శ్యాంసుందర్, మునిసిపల్ ఏఈలు కట్టా రవి, శైలజ పాల్గొన్నారు.