కడప : కడప విద్యుత్ భవన్‌లో మంగళవారం నిర్వహించి ప్రత్యేక విద్యుత్ అదాలత్‌లో ముగ్గురు వినియోగదారుల విద్యుత్ సమస్యలపై అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి మాట్లాడుతూ విద్యుత్ ఎస్‌ఈ ఎస్. రమణ, కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్. నరసింహ ప్రసాద్ పనితీరు మెరుగ్గా ఉందని వారిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కడప జిల్లాలో విద్యుత్ సమస్యలు తక్కువగా ఉన్నాయంటే బాగా పని చేస్తున్నారని అర్థమవుతుందన్నారు. ప్రత్యేక విద్యుత్ అదాలత్ ఉద్దేశించి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్ పర్సన్ వి శ్రీనివాస ఆంజనేయ మూర్తి మాట్లాడారు. ప్రభత్యము నిర్వహిస్తున్న స్పందన, జగనన్నకు చెపుతాం వంటి కార్యక్రమాల విశేష స్పందన వలన సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అవుతుండడం వల్ల మా వద్దకు వచ్చే సమస్యలు చాలా వరకు తగ్గాయని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సభ్యుడు ఫైనాన్స్ రామ్మోహన్ రావు, టెక్నికల్ ఎస్‌ఎల్ అంజనీ కుమార్, కడప ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్. నరసింహ ప్రసాద్, ఇంజినీర్లు, అకౌంట్స్ అధికారులు పాల్గొన్నారు.










