Aug 07,2023 00:12

రెగ్యులేటరీ డ్యామ్‌ను పరిశీలిస్తున్న విద్యుత్‌ శాఖ అధికారులు

ప్రజాశక్తి -సీలేరు
విజయవాడ విద్యుత్‌ సౌధ చీఫ్‌ ఇంజనీర్‌ (సివిల్‌) కోటేశ్వరరావు ఆదివారం ఎపి జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. మెయిన్‌ డ్యాం, రెగ్యులేటరీ డ్యాం జలాశయాలను పరిశీలించారు. సీలేరు జల విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్‌ ఉత్పత్తి జరిగే యూనిట్లు పనితీరుపై ఆరా తీశారు. మరమ్మతులకు గురైన నాలుగో యూనిట్‌ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని స్వయంగా పరిశీలించారు. సీలేరులో నూతనంగా నెలకొల్పబోయే 1350 మెగావాట్ల సామర్థ్యం గల టన్నెల ప్రాజెక్టుకు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలన చేశారు. అనంతరం దిగు సీలేరు డొంకరాయి జలవద్యుత్‌ కేంద్రానికి చేరుకొని అక్కడ జల విద్యుత్‌ కేంద్రం పనితీరుపై తనిఖీలు నిర్వహించారు. డొంకరాయి జలాశయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోల్లూరు చేరుకొని జల విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి తీరును స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో (విజయవాడ విద్యుత్‌ సౌద) ఎస్‌ఇ హైడల్‌ శేఖర్‌, సీలేరు కాంప్లెక్స్‌ ఎస్‌ఈ సివిల్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, ఈఈ ప్రభాకర్‌, ఏడిఈ అప్పలనాయుడు, ఏఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.