Oct 09,2023 00:00

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి
- ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే కారణం?
ప్రజాశక్తి - బుచ్చినాయుడు కండ్రిగ:ట్రాన్స్‌ కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారి వీధులను అవగాహన లేమితో నిర్వర్తిస్తూ ఓ ప్రవేటు కూలీ విద్యుతు బలైపోయాడు. దీంతో ప్రయివేటు కూలీ భార్య, ఇద్దరు చిన్నారులైన కుమారుడు, కూతురు జీవనం కోల్పోయి వీధిన పడ్డారు. గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా ట్రాన్స్‌ కో అధికారుల తీరు మారటం లేదని మండల ప్రజలు అంటున్నారు. వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్‌ ఫార్మరు మరమ్మతులు చేపడుతూ విద్యుత్‌ షాక్‌కు గురై ప్రైవేటు కూలీ యువకుడు తీవ్రంగా గాయపడి మతి సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్తపాళెం దళితవాడకు చెందిన బాలకష్ణ (28) విద్యుత్‌కు సంబంధించిన పనులు చేసుకుంటూ వచ్చే కూలీ డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం, సపలమాల గ్రామానికి చెందిన ఓ రైతు పంట పాఠాలలోని -ట్రాన్స్‌ ఫార్మరుకు విద్యుత్‌ రాకపోవటంతో బోరుమోటారు పనిచేయటం లేదని లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రకు ఫిర్యాదు చేశారు. దీంతో లైన్‌ ఇన్‌స్పెక్టరు రవీంద్ర బాలకష్ణను వెళ్లి మరమ్మతులు చేయాలని తెలిపారు. బాలకష్ణ పొలాల వద్దకు వెళ్లగా లైన్‌ ఇన్‌స్పెక్టరు రవీంద్ర పల్లమాల గ్రామంలోని సబ్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి ఆలత్తూరు, పల్లమాల ఫీడర్లకు ఎల్సీ కావాలని షిఫ్ట్‌ ఆపరేటర్‌ మనోహర్‌ కోరగా ఎల్సీ ఇచ్చారు. అయితే పొలాలలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కాటూరు ఫీడర్లో ఉంది. దీంతో ట్రాన్స్‌ ఫార్మర్లో విద్యుత్‌ సరఫరా ఆగలేదు. ఇది తెలియని బాలకష్ణ మరమ్మతుల కోసం ట్రాన్స్‌ ఫార్మర్‌ పైకి ఎక్కడంతో వెంటనే విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. పల్లమాల సబ్‌ స్టేషన్‌లోనూ భారీ శబ్దం రావటంతో షీఫ్ట్‌ ఆపరేటర్‌ మనోహర్‌ విద్యుత్‌ నిలిపివేశారు. ఇది గమనించిన రైతులు ట్రాన్స్‌ ఫార్మర్‌ విద్యుత్‌ వైర్లలలో ఇరుక్కుపోయిన బాలకష్ణను కిందకు దింపి శ్రీకాళహస్తిలోని ఓప్రవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్సకోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మతి చెందారు. ఈ ఘటనకు ట్రాన్స్‌కో అధికారులు బాధ్యత వహించాలని కొత్తపాళెం గ్రామస్తులు సబ్‌ స్టేషన్‌ గేటు మూసి ఆందోళన చేపట్టారు. లైన్‌ ఇన్‌స్పెక్టరు రవీంద్ర చేయాల్సిన పనిని బాలకష్ణ చేసి, ప్రాణాలను కోల్పోయాడని వాపోయారు. మతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.