Aug 23,2023 22:45

సొవ్ర బిష్ణు, హుడా బగ్దీరా మృతదేహాలు

* బోర్‌వెల్‌ వేస్తుండగా ప్రమాదం
* మృతులు ఒడిశా వాసులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీ సెగిడిపేటలో విద్యుత్‌ షాక్‌తో ఒడిశాకు చెందిన కూలీలు సొవ్ర బిష్ణు (34), హుడా బగ్దీరా (21) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలో బుధవారం బోరు వేస్తుండగా విద్యుత్‌ వైర్లు బోర్‌వెల్‌ పైపునకు తగలడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. సంఘటన స్థలంలోనే వారిరువురూ మృతి చెందారు. మరో కూలీ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతనిని శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.