Mar 23,2023 21:23

విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఈశ్వర్ రెడ్డి

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
ప్రజాశక్తి బనగానపల్లె

      మండలంలోని ఇల్లూరు కొత్తపేట గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి 42 అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు ఎస్సై రామిరెడ్డి తెలిపారు గురువారం రాత్రి ఇల్లూరు కొత్తపేట గ్రామంలోని ఆంజనేయస్వామి దేవస్థానం సమీపంలో మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర మోటర్ ను రిపేర్ చేస్తున్న ఈశ్వర్ రెడ్డికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు గ్రామ ప్రజలు పోలీసులు తెలిపారు . మృతుడు ఈశ్వర్ రెడ్డి కి భార్య లక్ష్మీదేవి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు .కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు