Nov 02,2023 00:50

విలేకర్లతో మాట్లాడుతున్న పి.కోటిరావు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : నష్టాల్లో ఉన్న టెక్స్‌టైల్‌ మిల్లులను ఆదుకు నేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకో వాలని రాష్ట్ర టెక్స్‌్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పి.కోటిరావు కోరారు. గుంటూ రులోని లక్ష్మీపురం అసోసియేషన్‌ కార్యాల యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వస్త్ర పరిశ్రమ క్లిష్టపరి స్థితులను ఎదుర్కొంటోందన్నారు. కరోనా తర్వాత మారిన మార్కెట్‌ పరిస్థితులు, పెరిగిన పత్తి ధరలు, తగ్గిన నూలు ధరలు, విద్యుత్‌ అదనపు ఛార్జీల భారం వల్ల తమ పరిశ్రమ అనేక ఒడిదుడు కులను ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన విద్యుత్‌ రాయితీలు ఈ ఏడాది ఇంత వరకు విడుదల కాలేదని చెప్పారు. సిఎఫ్‌ఎంఎస్‌లో రూ.192 కోట్ల బకాయిల బిల్లులు అప్‌లోడ్‌ చేసి నెలలు గడిచినా ఇంత వరకు నిధులు రాలేదని, ఫలితంగా తమ మిల్లులు మూతపడే పరిస్థితి నెలకొందని, లక్ష మందికి ప్రత్యక్షంగా, మరో లక్ష మందికి పరోక్షంగా కార్మికుల ఉపాధికి దెబ్బ తగులు తోందని వివరించారు. విద్యుత్‌ సబ్సిడీ తెలంగా ణలో అందచేస్తున్నట్టుగా రాష్ట్రంలోనూ యూని ట్‌కు రూ.2 ఇవ్వాలన్నారు. విద్యుత్‌ డ్యూటీ ఛార్జీలు, ట్రూ అప్‌ ఛార్జీలు, ఇతర అదనపు ఛార్జీ లను మినహాయింపులు ఇవ్వాలన్నారు. తమ పరిశ్రమ స్థిరమైన ఇంధన వనరులకు సహయ పడటానికి సౌర, పవన విద్యుత్‌ యూనిట్ల స్థాప నకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. తమ పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి జిఎస్‌టి రూపంలో రూ.కోట్ల ఆదాయం వస్తోందని చెపారు. సమావేశంలో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ఎల్‌.రఘురామి రెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్‌.కోటేశ్వరరావు, ఎంవి సత్యనారా యణ, పి.వీరయ్య, కె.నాగిరెడ్డి, డి.సూర్య ప్రకాశరావు, బి.బెనర్జి, కోశాధికారి పి.చలపతిరావు పాల్గొన్నారు.