ప్రజాశక్తి మారేడుమిల్లి
విద్యుత్ ప్రమాదంలో తీవ్ర గాయపడి నడవలేసి స్థితిలో ఉన్న గిరిజనుడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లభించింది. మండలంలోని చట్లవాడ పంచాయితీ పరిధి బొజ్జలగొంది గ్రామానికి చెందిన సాదల అబ్బాయిరెడ్డి ఇటీవల విద్యుత్ ప్రమాదంలో తీవ్ర గాయపడి రెండు కాళ్ళు పోగొట్టుకుని, నడివలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఆయన కుటుంబ పోషణ కష్టంగా మారింది. పేదవారు కావడంతో వైద్య సేవలు కూడా పొందే స్థితి లేకుండా పోయింది. ఇది గమనించిన మారేడుమిల్లి వైసిపి నాయకులు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు దృష్టికి తీసుకువెళ్లగా, వారి చొరవతో సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. సోమవారం బాధితుడికి ఈ చెక్కును ఎల్లవరం గ్రామంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సార్ల లలిత కుమారి, సర్పంచులు కొండ జాకబ్, దూడ ప్రేమలత, కో ఆప్షన్ సభ్యుడు గురుకు ధర్మరాజు, పార్టీ మండల కన్వీనర్ సత్తి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి గంగరాజు పాల్గొన్నారు.










