
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
సమస్యల పరిష్కారంకు విద్యుత్ మీటర్ రీడర్స్ చేపట్టిన బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌కె.సుభాషిని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో విద్యుత్ మీటర్ రీడర్ బైక్ ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాషిని మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ సోమవారం సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్స్ బైక్ ర్యాలీ ఏలూరుకు చేరుతుందన్నారు. ఏలూరులో బైక్ ర్యాలీకి ఘన స్వాగతం పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మేటర్ రీడర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఒ.శ్రీను, మల్లేశ్వరరావు, మురళి, కె.సురేష్ పాల్గొన్నారు.