విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమం ఉదృతంట్రూఅప్, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి
కడప అర్బన్ : సిఎం జగన్ పాలనలో సర్వం బాదుడేనని, ప్రజలపై భారాలు మోపుతున్న విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం ట్రూ అప్, సర్దుబాటు, విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిరసిస్తూ విద్యుత్ భవన్ వద్ద అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు చంద్రశేఖర్, చంద్ర, టిడిపి నాయకులు అమీర్ బాబు, లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సత్తార్, బండి జకరయ్య, బిసి మహాసభ నేత అవ్వారు మల్లికార్జున, బిఎస్‌పి నేత గుర్రప్ప, వామపక్ష నాయకులు డబ్ల్యూ. రాము, సుబ్బరాయుడు, జయవర్దన్, లోక్ సత్తా శ్రీకష్ణ, జనతాదళ్ ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. వినియోగించిన విద్యుత్ బిల్లులే కాకుండా ఫిక్స్‌డ్, కస్టమర్, సర్, సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అధిక వసూళ్లకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల కోసం కేంద్రం చెప్పినట్లు జగన్ ప్రభుత్వం తలాడిస్తూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించి కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్లు దోచి పెట్టేందుకు జగన్ ప్రభుత్వం సన్నద్ధం కావడం దారుణమన్నారు. ఆదాని స్మార్ట్ మీటర్ల కంపెనీ ప్రారంభించడం, స్మార్ట్ మీటర్లు పెట్టాలని మోడీ ఆదేశించడం, జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల టెండర్లు పిలవడం ఇవన్నీ అదాని కంపెనీకి ప్రజల సొమ్మును ధారాదత్తం చేసే కుట్రలో భాగమేనన్నారు. బహిరంగ మార్కె ట్లో అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా బాదుడే బాదుడని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి విద్యుత్ దోపిడీ దొంగగా మారారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాదుడుపై ప్రజలు మరో విద్యుత్ ఉద్యమానికి సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి రావాలని కోరారు. విద్యుత్ బాదుడు గోడును సిఎంకు చెప్పేందుకు ఈ నెల 5న సమా యత్తం కావాలన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు దశలవారి ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు రామ మోహన్, వెంకటశివ, కాంగ్రెస్ నగర అధ్యక్షులు విష్ణు ప్రీతమ్ రెడ్డి, సిపిఐ నగర సహాయ కార్యదర్శిలు కెసి బాదుల్లా, మద్ది లేటి అఖిలపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు సిహెచ్‌ఆర్డీ శివారెడ్డి, సావంత్ సుధాకర్, శ్రీనివాసులు రెడ్డి, టక్కొలి మనో హర్‌రెడ్డి, ఓబయ్య, శంకర్ నాయక్, భాగ్యలక్ష్మి, ఐ.ఎన్. సుబ్బమ్మ, రాజమణి, సి.ఆర్.వి. ప్రసాద్, నారాయణ, పాపిరెడ్డి, శివకుమార్, చంద్రారెడ్డి, డి.యం. ఓబులేసు, రాహు ల్, చైతన్య, నారాయణరెడ్డి, సుబ్బరాయుడు, యేసు రత్నం, పుల్లయ్య, సాలమ్మ, కామేశ్వరమ్మ, డేవిడ్, గుర్రప్ప, ఐఎంఎల్ రఘురామయ్య, రామమోహన్‌రెడ్డి,సుబ్బారెడ్డి, పాల్గొన్నారు.
జమ్మలమడుగు రూరల్ : దేశంలో మరో విద్యుత్ ఉద్యమానికి సమాయత్తం కావాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి. మనోహర్, సిపిఎం జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి వి. శివ నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్‌లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంపు, ట్రూ ఆప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల రద్దు వంటి వాటిని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నా మన్నారు. అప్పుల కోసం కేంద్రం చెప్పినట్లు జగన్ ప్రభుత్వం తలాడిస్తూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని వాపోయారు. ఆదానీ స్మార్ట్ మీటర్ల కంపెనీ ప్రారం భించడం, స్మార్ట్ మీటర్లు పెట్టాలని మోడీ ఆదేశించడం, జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల టెండర్లు పిలవడం ఇవన్నీ అదాని కంపెనీకి ప్రజల సొమ్మును ధారాదత్తం చేసే కుట్రలో భాగమే నన్నారు. బహిరంగ మార్కెట్లో అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంద న్నారు. ప్రజలు మరో విద్యుత్ ఉద్యమానికి సమాయత్తం కావాలన్నారు. కార్య క్రమంలో సిపిఎం నాయకులు దాసరి విజరు, ఎ.వినరు కుమార్, సిఐటియు ఆటో యూనియన్ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, సిఐటియు ఆటో నాయకులు దస్తగిరి, రాజు, పాములేటి, అబ్రహం, దస్తగిరి, సుల్తాన్, బాబావల్లి పాల్గొన్నారు.










