ప్రజాశక్తి-ఉలవపాడు : ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీ నుంచి ఈనెల 4వరకు ఉలవపాడు లో సమరభేరి జరిగింది. సిపిఎం నాయకులు అన్నీ గిరిజన కాలనీలు తిరిగి కరపత్రాలు పంచి వారి సమస్యలను తెలుసుకున్నారు. సోమవారం తహశీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. .ఈధర్నా కు సిపిఎం మండల నాయకులు ఎస్.డి.గౌస్ బాషా అధ్యక్షత వహించారు. సిపిఎం మండల కార్యదర్శి జీవీబీకుమార్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఉలవపాడులో సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమం పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకున్నట్లు తెలిపారు. అనేక సమస్యలు తమ దష్టికి వచ్చాయని ఆయా సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ ఎంపీడీవో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఎం మండల నాయకులుకొమరగిరి. వెంకటేశ్వర్లు,ఏలూరి. నాగార్జున, కే.శేషమ్మ,పొట్లూరి. రవి,ఎస్. డి. జహీర్, ఎస్.కె.సుల్తాన్, రాపూరి ఎలమందమ్మ, చేవూరు లక్ష్మి, చేవూరి నాగమ్మ, ఆర్ అనసూయమ్మ ఉన్నారు.










