నిరసన తెలుపుతున్న దృశ్యం
ప్రజాశక్తి-ఉలవపాడు : ఇటీవల రాష్ట్ర పభుత్వం వివిధ రూపాల్లో ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలను తగ్గించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ,సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. సిపిఎం ఉలవపాడు మండల కార్యదర్శి జివిబికుమార్ మాట్లాడారు. విద్యుత్ విని యోగదారులపై సర్ ఛార్జీల పేరుతో భారాలను మోపడం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. సిపిఎం ఉలవపాడు మండల నాయకురాలు కొమరగిరి శేషమ్మ ,కత్తి. సుజాత, సిఐటియు కార్యకర్తలు తవరలక్ష్మి శైలజ గోవిందమ్మ, శోభా కుమారి పాల్గొన్నారు.










