ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : విద్యుత్ ఛార్జీలపై సంఘటిత పోరాటాలు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చాఇంది. వివిధ ఛార్జీల పేరుతో పెంచిన విద్యుల్ బిల్లుల రద్దు కోసం పల్నాడు జిల్లా పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో హోంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఆదివారం న్విహించారు. సమావేశానికి సిపిఎం పట్టణ కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం సరైన నిర్ణయం కాదన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలతో పేద ప్రజలు అర్ధాకలితో అలాంటిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంసిపిఐ (యు), జైభీమ్ భారత్ పార్టీ, ఎంఐఎం, సిఐటియు, రైతు సంఘం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా 5-10 తేదీల్లో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో సోలార్ విద్యుత్ ప్యానల్ డీలర్ రామ్‌మోహన్‌రావు, ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి షేక్ మొహిద్దిన్‌బాష, జై భీమ్ భారత్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా సమన్వయకర్త జి.జాన్‌పాల్, ఎంఐఎం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామారావు, నాయకులు కె.ఆంజనేయులు, రైతు సంఘం నాయకులు బి.నాగేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పూర్ణచంద్రరావు, సిఐటియు నాయకులు జి.మల్లీశ్వరి, ఎస్.వెంకటేశ్వరరాజు, శ్రీను, ఐద్వా నాయకులు నాగమ్మ పాల్గొన్నారు.










