Aug 14,2023 22:15

ప్రజాశక్తి - నిడమర్రు
     రాష్ట్ర హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తుందని, విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లను కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని సిపిఎం మండల కన్వీనర్‌ నారపల్లి రమణారావు తెలిపారు. పేద ప్రజలపై గత మూడు, నాలుగు నెలలుగా విద్యుత్‌ బారాలు విపరీతంగా మోపుతుందని, నాణ్యమైన కరెంటు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్ల కాలంలో గ్రామాభివృద్ధి కుంటుపడిందన్నారు. 14, 15 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడానికి ప్రయత్నిస్తుందన్నారు. రాబోయే కాలంలో అధిక ధరలకు నిరసనగా ఉద్యమం చేపడతామని సమావేశం తీర్మానం చేసింది. ఈ సమావేశంలో కోన శ్రీనివాసరావు, గవర సత్యనారాయణ, కంచం వరప్రసాద్‌, లావేటి చందర్రావు, వెలగలేటి మోహన పాల్గొన్నారు.