Jun 22,2023 22:59

ప్రజాశక్తి-ఏలేశ్వరం పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. స్థానిక బాలాజీ చౌక్‌ సెంటర్లో నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్‌ శాఖ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు, లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీలు, బస్సు చార్జీలు పెంచేది లేదని అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఇప్పటికీ ఏడుసార్లు ఛార్జీలు పెంచారన్నారు. పెంచిన ఛార్జీల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన చార్జీలను తగ్గించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వేమగిరి దొంగబాబు, పెద్దపాటి నాని, సీలు బాలమ్మ, ఖండవిల్లి చిన్నరాజు, కాళ్ల వీరులు, ఆరుగల్లు కామరాజు, ఇంటి గురవయ్య, జెడ్డ నూకరాజు, నేలపాటి అప్పారావు, కిలాడి నాగమణి, అవిటి నాగరాజు, మిరియాల లక్ష్మి, చింతపల్లి రాజులమ్మ, బొడ్డు భద్రమ్మ పాల్గొన్నారు.