Oct 16,2023 00:42
ఇంకొల్లులో ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా నాయకులు జి ప్రతాప్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఇంకొల్లు బస్టాండ్‌ సెంటర్‌ లో కరపత్రాలు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ప్రతాప్‌ కుమార్‌ మాట్లాడుతూ గత సంవత్సరం విద్యుత్‌ చార్జీలు పెంచి రూ.1400 కోట్లు ప్రజలపై భారాలు మోపిందన్నారు. గత 10 ఏళ్ల నుంచి వాడుతున్న విద్యుత్‌కు అప్పుడు బిల్లులు కట్టినప్పటికీ మరలా సర్దుబాటు చార్జీల పేరుతో ప్రభావాలపై రూ.6 వేల కోట్లు భారం వేసిందన్నారు. గత నాలుగు సంవత్సరాలలో రూ.25 వేల కోట్ల విద్యుత్‌ భారాలు ప్రజలపై వేశారన్నారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి స్మార్ట్‌ మీటర్లు పెట్టబోతున్నారన్నారు. సర్దుబాటు చార్జీల పేరుతో మోసం చేస్తున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాగండ్ల వెంకట్రావు, గంగయ్య, రవికుమార్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.