విద్యుత్ చార్జీలు తగ్గించాలి
వామపక్షాల ధర్నా
ప్రజాశక్తి - గూడూరు టౌన్
రాష్ట్ర ప్రభుత్వం అనేక పేర్లతో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిందని, దీని వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం నాయకులు జోగి శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల ధరలు తగ్గించాలని గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం , సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జోగి శివకుమార్, సిపిఐ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎస్సీ ఎస్టీల వారికి ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం కాలనీగా ఉంటేనే ఇస్తామని, అనేక మంది పేదవారికి ఉచిత విద్యుత్ కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఇకనైనా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు వెంకట రామి రెడ్డి , సి.ఐ. టి.యు పట్టణ అధ్యక్షులు బి.వి.రమణయ్య , పట్టణ కార్యదర్శి సురేష్ , చంద్రయ్య , కోటి , కె.వి.పి. ఎస్ పట్టణ కార్యదర్శి అడపాల ప్రసాద్ , సీపీఐ నాయకులు శశి కుమార్ , ఎంబెటి చంద్రయ్య , రమేష్ పాల్గొన్నారు.










