ప్రజాశక్తి - ఆదోని
రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ టిడిపి కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి డిమాండ్ చేశారు. మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో స్థానిక తిమ్మారెడ్డి బస్టాండ్ దగ్గర ఉన్న విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రూ అప్ చార్జీలు, సర్ చార్జీలు, ఫిక్స్‌డ్ చార్జీల పేరుతో పేదలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలను ఎనిమిది సార్లు పెంచి, ఆ సాకుతో పథకాలకు అనర్హులను చేస్తున్నారని తెలిపారు. కోతలు లేని విద్యుత్ ఇవ్వాలని, పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బోరుబావుల మోటార్లకు మీటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ రాజుకు వినతి పత్రం అందజేశారు. నాయకులు వెంకటేష్, తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, జయరాం, గోపాల్, రవి, బాలాజీ, సుబ్బు, మల్లికార్జున, రామాంజి, మహ్మద్, వలీ, ప్రతాప్ రెడ్డి, నాగరాజు, మాబాష, ఉరుకుందు, సూర్య, వీరేష్, మహేంద్ర, రామలింగ, గౌస్, సాధికా బేగం, శ్రీదేవి, కుమారి పాల్గొన్నారు. గోనెగండ్లలోని టిడిపి మండల కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి మండల విద్యుత్ సబ్ స్టేషన్ ఎడిఇ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. టిడిపి నాయకులు తిరుపతయ్య నాయుడు, శ్రీధర్ నాయుడు, కులుమాల రాముడు, రమేష్ నాయుడు, నూర్ అహ్మద్, అల్ల బండ మిన్నెల్లా, కొత్తింటి అచ్చు గట్ల ఫక్రుద్దీన్, పూజారి రంగస్వామి, రాంపురం లాలు పాల్గొన్నారు. దేవనకొండ క్రాస్ సబ్ స్టేషన్ విద్యుత్ కార్యాలయం ముందు టిడిపి ఆలూరు ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆదేశాల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ విజరు భాస్కర్ గౌడ్, మండల నాయకులు ఉచ్చీరప్ప, బడిగింజల రంగన్న, మాలిక్ బాష మాట్లాడారు. టిడిపి నాయకులు మల్లయ్య, ఆకుల వీరేష్, బండ్లయ్య, నాగరాజు గౌడ్, రాజశేఖర్ గౌడ్, దేవేంద్ర గౌడ్, మస్తాన్, సుభాన్, తిమ్మయ్య, సూరన్న గౌడ్, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు పెద్దయ్య పాల్గొన్నారు. నందవరం మండల టిడిపి కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ.జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ర్యాలీగా బయల్దేరి విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. టిడిపి నందవరం నాయకులు ఖాసీం వలీ, గడ్డం నారాయణరెడ్డి, నాగరాజు గౌడ్, మండల కన్వీనర్ చిన్న రాముడు, ధర్మపురం గోపాల్, వీరేష్, వీరేష్, గజేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్ భవనం ముందు ధర్నాలో పాల్గొన్న భూపాల్ చౌదరి










