Jun 20,2023 19:32

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
విద్యుత్‌ చార్జీల భారాలపై ప్రజలు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఎం తాలూకా నాయకులు హనుమంతు, రాముడు కోరారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్‌లో విద్యుత్‌ చార్జీల పెంపునకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విద్యుత్‌ చార్జీలను ఐదేళ్లలో పెంచబోమని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారని, రాష్ట్రంలో ట్రూఅప్‌ పేరుతో చార్జీల భారం వేస్తున్నారని చెప్పారు. అలాగే శ్లాబ్‌ పేరుతో ప్రజలపై మరో భారాన్ని మోపారన్నారు. బిల్లులో విద్యుత్‌ భారం కంటే అనేక రకాల చార్జీల భారం ఎక్కువయిందన్నారు. అదనపు చార్జీలను వెనుకకు తీసుకోకపోతే ప్రజలు మరో విద్యుత్‌ పోరాటానికి సన్నద్ధం కావాలని కోరారు. సిపిఎం నాయకులు లక్ష్మీ నరసయ్య, ఎంపి.రాజు, వెంకటేష్‌, అబ్దుల్లా, బి.రాజు, ఆంథోని, వెంకటేశ్వర్లుశెట్టి, కాలప్ప, రోషన్న, విజరు, కొండన్న పాల్గొన్నారు.