Apr 11,2023 00:32

మాడుగులలో నిరసన ర్యాలీ చేస్తున్న కుమార్‌ తదితరులు

ప్రజాశక్తి-యంత్రాంగం
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల పెంపు, వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ టిడిపి ఆధ్వర్యాన జిల్లాలో పలుచోట్ల సోమవారం నిరసనలు తెలిపారు.
తగరపువలస : చిట్టివలస విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట టిడిపి నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు మాట్లాడుతూ, ఈ నాలుగేళ్ల వైసిపి పాలనలో 7సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.57వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డిఎఎన్‌.రాజు, సరగడ అప్పారావు, కోరాడ రమణ, తమ్మిన వెంకటరమణ పాత్రుడు, టి.సూరిబాబు, బడిగింటి నీలకంఠం, చిలకా నరసింగరావు, ఎంవి గురుమూర్తి, పతివాడ రాంబాబు, దండి వెంకటేష్‌, వానపల్లి సత్య, గిడుతూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు జంక్షన్‌లో బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జంక్షన్‌ నుంచి చిట్టివలస విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.
భీమిలిలో కృష్ణా కాలనీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట టిడిపి 3,4 వార్డుల కమిటీల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, మూడో వార్డు ప్రధాన కార్యదర్శి గొలగాని నరేంద్ర కుమార్‌, మాజీ సర్పంచ్‌ కారి అప్పారావు, నాయకులు కనకల అప్పల నాయుడు, ఎస్‌.జోగారావు తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి : పెందుర్తి సబ్‌ స్టేషన్‌ వద్ద టిడిపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ, మాట తప్పను.. మడం తిప్పను.. అంటే ఛార్జీలు బాధడమేనా అని ఎద్దేవాచేశారు.
మధురవాడ : 8వ వార్డు పరిధిలోని ఎండాడ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద వార్డు టిడిపి అధ్యక్షుడు శెట్టిపల్లి గోపి ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడెపుడి దొరబాబు, సార్‌పల్లి శ్రీనివాసు, అక్కరబోయిన రాంబాబు,ఉప్పులూరి గోవిందరావు, చిన్న గోపి, పరమేశ్వరరావు, ఒమ్మి బాబూరావు, శెట్టిపల్లి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
మధురవాడ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద జివిఎంసి 5, 6, 7 వార్డుల అధ్యక్షులు, కార్పొరేటర్లతో కలిసి భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో 5, 7 వార్డుల కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిల్లా మంగమ్మ, నాయకులు సత్యనారాయణ, దాసరి శ్రీనివాస్‌, పిల్లా నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
ఆనందపురం : ఆనందపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎఇ సురేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బోద్దపు శ్రీనివాస్‌, మీసాల సత్యనారాయణ, తాట్రాజు అప్పారావు, కర్రి శ్రీనివాసరావు, విఆర్‌కె.రాజు, కొట్యాడ రెడ్డిబాబు, షినగం రామకృష్ణ, పడాల అప్పలనాయుడు, బంటుబిల్లి అప్పలస్వామి, లోడగల వెంకట్రావు, షినగం శివ, బలిరెడ్డి మల్లికార్జునరావు, వానపల్లి ముత్యాలరావు, బోని ప్రసాద్‌, మరుపల్లి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని టిడిపి దక్షిణ ఇన్‌ఛార్జి గండి బాబ్జీ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్టీసి కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట టిడిపి కార్యకర్తలు ఆయన ఆధ్వర్యంలో మోకాళ్ళపై నిలబడి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిపాలన చేతగాని సిఎం గద్దె దిగాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ దక్షిణ నాయకులు పొడుగు కుమార్‌, విల్లూరి డాక్టర్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలి : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యాన సోమవారం ర్యాలీ నిర్వహించి, విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని పేర్కొన్నారు. ఈ కార్యమ్రంలో టిడిపి నాయకులు విజయబాబు, ఇత్తంశెట్టి రాజు, నాగేశ్వరరావు, శివనారాయణ, రమణబాబు పాల్గొన్నారు.
అనకాపల్లి : వైసిపి పాలనలో విద్యుత్తు కొనుగోలులో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగిందని, జగన్‌ రెడ్డి చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నీ దొంగ లెక్కలేనని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ విమర్శించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలకు నిరసనగా స్థానిక ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వైసిపి ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మల్ల సురేంద్ర, జోగినాయుడు, పోలవరపు త్రినాథ్‌, సబ్బవరం గణేష్‌, షేక్‌ బాబర్‌, ధనాల విష్ణు చౌదరి, సూరే సతీష్‌ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ అచ్చుతాపురం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద టిడిపి నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. దీనికి ముందు అచ్చుతాపురం జంక్షన్‌ నుంచి ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, జనపరెడ్డి నర్సింగరావు, లాలం నాగేశ్వరరావు, లాలం రాజు, మామిడి శివ అప్పారావు, నీరుకొండ నర్సింగరావు, ప్రతివాడు చిన్నయ్య నాయుడు, రాజాన నానాజీ ధర్మిరెడ్డి ప్రసాద్‌, జూనియర్‌ నాగేశ్వరావు, కర్రి రమణ పాల్గొన్నారు.
వడ్డాది : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచి ప్రజలపై అధిక భారాన్ని మోపుతుందని మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు అన్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెంపునకు వ్యతిరేకంగా వడ్డాది జంక్షన్లో ర్యాలీ సోమవారం నిర్వహించారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మాడుగుల : పరిశ్రమలకు విద్యుత్‌ పవర్‌ హాలీ డే ప్రకటించిన వైసిపి ప్రభుత్వం, విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపడం అన్యాయమని టిడిపి ఇన్‌ ఛార్జ్‌ పివిజి కుమార్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టారిఫ్‌ల కుదింపు, స్లాబుల మార్పు, ఫిక్స్డ్‌ చార్జీలు, అదనపు డిపాజిట్‌ల రూపంలో 7 సార్లు చార్జీలు పెంచిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి జగ్గారావు, ఉండూరు దేవుడు, కసిరెడ్డి అప్పలనాయుడు, జోరెడ్డి రాము, సబ్బవరపు అప్పలనాయుడు, గొల్లవిల్లి శ్రీరామ్మూర్తి, పుప్పాల రమేష్‌, పేరపు కొండబాబు, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ :స్థానిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జడ్పిటిసి సుకల రమణమ్మ మాట్లాడుతూ, వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్యులపై విద్యుత్‌ భారం భారీగా మోపారని విమర్శించారు. పార్టీ ప్రెసిడెంట్‌ లాలం శ్రీరంగ స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు దనిమిరెడ్డి మధు, కొరపోలి శ్రీనివాస్‌, కొరుపోలు అప్పలరాజు పాల్గొన్నారు.
కోటవురట్ల: నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రజలపై మోయలేని విద్యుత్‌ భారం మోపిందని మండల టిడిపి అధ్యక్షులు జానకి శ్రీను సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు తిరుమలరావు, ఎస్‌ బాబ్జి, టి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
గొలుగొండ : మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో జోగంపేట జంక్షన్‌ నుండి గొలుగొండ విద్యుత్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోద్యం మాజీ సొసైటీ అధ్యక్షులు కొల్లాన కొండలరావు, చోద్యం సర్పంచ్‌ ఆదపరెడ్డి గోపాలకృష్ణ, కె.ఎల్లవరం సర్పంచ్‌ కొల్లు రాంబాబు, జోగంపేట మాజీ సర్పంచ్‌ సుర్ల సీతారామమూర్తి, మాజీ జెడ్పీటీసీ చిటికెల తారకవేణుగోపాల్‌, కొత్తమల్లంపేట మాజీ సర్పంచ్‌ చిటికెల సాంబమూర్తి పాల్గొన్నారు.