
ప్రజాశక్తి - భట్టిప్రోలు
ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో 8విడతలుగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఎం, సిపిఐ నాయకులు రోడ్డు సత్యనారాయణ, గొట్టుముక్కల బాలాజీ కోరాఆరు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు సిఎం జగన్మోహన్ రెడ్డి విద్యుత్ చార్జీలను పెంచబోమని హామీ ఇచ్చి అధికారానికి వచ్చిన తర్వాత అందుకు వ్యతిరేకంగా 8విడుదలగా చార్జీలు పెంచి ప్రజలనడ్డి విడిచారని అన్నారు. ఈనెల 9నుండి 15వరకు జరిగే ఆందోళనలో భాగంగా 11న బట్టిప్రోలులో జరిగే ధర్నాకు ప్రజలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బట్టు నాగమల్లేశ్వరరావు, బండారు శ్రీనివాసరావు, ప్రజాసంఘాల నాయకులు మోహనరావు, శ్రీనివాసరావు ఉన్నారు.