విద్యుత్ చార్జీల పెంపు వెనక్కి తీసుకోవాలి : టిడిపి
చాగలమర్రి : రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ మండలంలోని ముత్యాలపాడు గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సోమవారం టిడిపి మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, నాయకులు రమణారెడ్డి, కటికం శేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, డిఎం బాష కిట్టు తదితరులు పాల్గొన్నారు. పగిడ్యాల : విద్యుత్ చార్జిల పెంపునకు వ్యతిరేకంగా టిడిపి మండల కన్వీనర్ పలుచాని మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పగిడ్యాల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. సిఎం జనగ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయత్రలో అధికారంలోకి వస్తే పూర్తిగా విద్యుత్ చార్జిలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు భారాలు వేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వాసురెడ్డి,పగడం శేఖర్,నాగశేషులు,నాగేశ్వరరావు,ఆశోక్,శ్రీనివాసులు,చిన్న రాముడు, పండు, ఆవుల శ్రీనివాసులు, ఎల్లస్వామి, గోకారి, విజరుకుమార్,సాంబశివుడు,బాబు, రాంబాబు నాగరాజు పాల్గొన్నారు. ఆత్మకూర్: ఆత్మకూరు సబ్ స్టేషన్ ఎదుట సీనియర్ నాయకులు శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ సర్పంచ్ కంచర్ల గోవింద రెడ్డి ల ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కలిముల్లా, పట్టణ అధ్యక్షుడు జెట్టి వేణు గోపాల్, మండల అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లాపురం బాషా, ఫకృద్దిన్, శాబుద్దిన్, గౌడ్, శ్రీను, గంగాధర్ రెడ్డి, శరత్, రాముర్తి, మురళి, సుబ్బయ్య, నబి, రహంతుల్లా, జలీల్, న్యమతుల్లా తదితరులు పాల్గొన్నారు. బేతంచెర్ల : పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని బేతంచెర్ల దేశం పార్టీ మండల కన్వీనర్ ఉన్నము ఎల్ల నాగయ్య, కార్యదర్శి షేక్షావలి చౌదరి డిమాండ్ చేశారు. బేతంచెర్ల స్థానిక టిడిపి కార్యాలయం నుండి టిడిపి మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య, టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి బేతంచెర్ల సబ్ స్టేషన్ ఎదురుగా నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా ఉన్నం ఎల్ల నాగయ్య, షేక్షావల్లి చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి రవీంద్ర నాయక్, రాష్ట్ర క్రిస్టియన్ కమిటీ కార్యదర్శి మేకల నాగరాజు, జాకీర్ మాజీ ఎంపీటీసీ, కౌన్సిలర్స్ రాంగోపాల్, తదితరులు పాల్గొన్నారు. పాములపాడు: పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని టిడిపి ఆధ్వర్యంలో పాములపాడు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, మండల నాయకులు తిమ్మారెడ్డి మాట్లాడారు. అనంతరం సబ్ స్టేషన్ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోవిందు, తెలుగు యువత అధ్యక్షులు మధు కృష్ణ, శివ శంకర్ స్వామి, ఆది రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బాల మల్లేశ్వర్ రెడ్డి ,స్వాములు, అబ్దుల్ ఆఫీస్, రామ చౌదరి, రామకృష్ణ, ఏసేపు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. గడివేముల : గడివేముల సబ్ స్టేషన్ వద్ద మండల టిడిపి నాయకులు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ మండలాధ్యక్షులు వంగాల శ్రీనివాస్ రెడ్డి, బూజనూరు రామచంద్రారెడ్డి, దుర్గేష్ కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.










