Jun 28,2023 21:20

నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

నినాదాలు చేస్తున్న ఉద్యోగులు
విద్యుత్‌ భవన్‌ లో భద్రత వారోత్సవాలు
నెల్లూరు :ఈ నెల 26వ తేది నుంచి జిల్లాలోని అన్ని డివిజన్లలో విద్యుత్తు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నగరంలోని విద్యుత్తు భవన్‌లో భద్రత వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ బి. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ విద్యుత్‌ భద్రత వారోత్సవాలు జిల్లాలో అన్ని డివిజన్‌ లలో ఈ నెల 26 వ తేదీ నుండి జరుగుతున్నాయని, జూలై 2వ తేదితో భద్రత వారోత్సవాలు ముగుస్తాయని, ఈ నేపథ్యంలో వినియోగదారులకు విద్యుత్‌ భద్రతపై అవగాహన కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి పాలుపంచుకోవలని పిలుపు నిచ్చారు. సహజంగా వేసవిలో విద్యుత్‌ వాడకం పెరుగుతుంది, ఎండల నుంచి ఉపశమనం కోసం ఏ.సీ.లు, కూలర్లు, ఫ్యాన్లు వంటి ఎలక్ట్రికల్‌ గహౌపకరణాల వినియోగం అధికంగా ఉంటుందన్నారు.
ఈ సమయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ చోటు చేసుకోవడంతో అగ్ని ప్రమాదాలు సంభవించి విలువైన ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యుత్తు పరికరాలను వినియోగించే సమయంలో వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ సోమశేఖర్‌ రెడ్డి, జయ కష్ణా రెడ్డి,బెనర్జీ,పరందామయ్య,మధు,సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ మురళీ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ టెక్నికల్‌ బాల చంద్ర,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌, సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస రెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు,అసోసియేషన్‌ నాయకులు సిబ్బంది పాల్గొన్నారు.