కడప : ట్రూ అప్ పేరుతో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించి అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ఎఐసిసి సభ్యులు బండి జకరయ్య, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్ హెచ్చరించారు. మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్ నాయకత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కడప లోని విద్యుత్‌భవన్ ఎదుట నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మో హన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి ఎడా పెడా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నారు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇటీవల ట్రూ అప్ ఛా ర్జీల పేరుతో రూ.1350 కోట్ల భారాన్ని మోపారని వాపో యా రు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అవ్వారు మల్లికార్జున, దస్తగిరిలతోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరి ప్రసాద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మధు రెడ్డి, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్యామల దేవి, గౌరీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్ల శ్రీనివాసులు, ఆనంద్ పాల్గొన్నారు.










