Sep 01,2023 21:22

బద్వేలు : సచివాలయం అధికారికి వినతి పత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

కడప అర్బన్‌ : ప్రజానీకం ఆగ్రహానికి గురికాకముందే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల అదనపు బారాల్ని రద్దు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలోని వివిధ వార్డు సచివాలయ అడ్మిన్‌లకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రామమోహన్‌ మాట్లాడుతూ సామాన్య ప్రజానీకం విద్యుత్‌ ఛార్జీల అదనపు భారాన్ని భరించలేక అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో విద్యుత్‌ కోతలను అరికట్టి సక్రమంగా విద్యుత్తు పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. భగత్‌ సింగ్‌ నగర్‌లో ఇంటిపై హై టెన్షన్‌ విద్యుత్‌ వైర్లు వెళ్తున్నాయని, వీటిని విద్యుత్‌ అధికారులు పక్కకు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. 46వ డివిజన్లో విజయనగర్‌ కాలనీలో రోడ్లు, డ్రెయినేజీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. కొప్పర్తి ఇండిస్టియల్‌ పార్కులో వస్తున్న పరిశ్రమల్లో నగరంలో స్థానికంగా చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా అవసరమైన చర్యలు అధికార యంత్రాంగం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 4న కార్పొరేషన్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నామన్నారు. ఆందోళనకు ప్రజానీకం పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, ఓబులేసు, ఫారుక్‌ హుస్సేన్‌, ఎం. ఆర్‌. నాయక్‌, జమీల, సీనియర్‌ నాయకుడు వెంకటాద్రి, గోవిందు, వెంకటసుబ్బయ్య, మహమ్మద్‌ గౌస్‌, యూసఫ్‌ అలీ ఖాన్‌, రఫీ, మున్నా పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : పట్టణంలోని ఆయా వార్డు సచివాలయ అడ్మిషన్లకు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వీరనాల శివ నారాయణ, నాయకులు మోరగుడి దాసు, దాసరి విజరు సిపిఎం బాషా, సురేష్‌, కళ్యాణ్‌ మున్నా పాల్గొన్నారు. బద్వేలు : స్థానిక 18వ వార్డులో సమస్యలు పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని సచివాలయం అధికారి ముద్దుకష్ణకు సిపిఎం బద్వేల్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు చాంద్‌ బాషా , సిపిఎం బద్వేల్‌ పట్టణ కమిటీ సభ్యురాలు మోక్షమ్మ, సిపిఎం నాయకులు బాల స్వామి, రవి, షరీఫ్‌, చెన్నయ్య, సిపిఎం మహిళా నాయకురాలు కైరున్‌ బి, మల్లేశ్వరమ్మ , ఫాతిమా , మాధవి , 18 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.