Jul 09,2023 21:29

బిల్లులు చూపిస్తూ నిరసన తెలుపుతున్న గ్రామస్తులు

ప్రజాశక్తి - బలిజిపేట :  ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. మండలంలోని పలగారలో ఇంటింటికి వెళ్లి వినియోగదారులకు వచ్చే విద్యుత్‌ బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ ఎప్పుడూ లేనంతగా కరెంటు బిల్లులు వచ్చాయని సిపిఎం నాయకులకు చెప్పారు. అనంతరం రెడ్డి వేణు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ట్రూఆప్‌, సర్దుబాటు, సర్‌ఛార్జీ, కస్టమర్‌ ఛార్జీలు ఇలా అనేక రకాలుగా ప్రజలపై విద్యుత్తు భారాలు వేయడం సరికాదన్నారు. ఇప్పటికే గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌, నిత్యవసర వస్తువు సరుకుల ధరలు విపరీతంగా పెరిగితే ఇప్పుడు ప్రభుత్వం ప్రజలపై ఇలాంటి భారాలు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం పెరిగిన బిల్లులతో పలగరలో గ్రామస్తులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బద్దన భానుమూర్తి, మజ్జి సన్యాసి, అల్లాడి కృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, వినియోగదారులు పాల్గొన్నారు.