
ప్రజాశక్తి- విలేకర్ల బృందం
అనకాపల్లి : విద్యుత్ ఛార్జీల అదనపు భారాలు రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని ఆపాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించారు. అనంతరం ఎపిఇప ిడిసిఎల్ అనకాపల్లి డిఇఇకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం మాట్లాడుతూ విద్యుత్ భారాలతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదాని, షిర్డీ సాయి కంపెనీల కోసం ప్రజలను దోచుకుంటారా అని ప్రశ్నించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బి.వెంకటరమణ మాట్లాడుతూ ప్రజలపై రూ.10వేల కోట్లు విద్యుత్ భారాల రూపంలో మోపారని తెలిపారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు పిఎస్.అజరు కుమార్, జి.కోటేశ్వరరావు, ఆర్.దొరబాబు, ఎ.బాలకృష్ణ, గంటా శ్రీరామ్, వైఎన్.భద్రం, ఆర్.శంకరరావు, కె.ఈశ్వరరావు, జి.సుభాషిణి, కె.తేల్లయ్యబాబు, తాకాశి వెంకటేశ్వరరావు, కె.శంకరరావు పాల్గొన్నారు.
కశింకోట : కసింకోట విద్యుత్ సెక్షన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన విద్యుత్ వినియోగదారులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయుకలు దాకారపు శ్రీనివాసరావు, ఐద్వా నాయకులు డిడి.వరలక్ష్మి, శేషు, సీతారత్నం, దేవి, అప్పారావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన స్థానిక మూడు రోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సిపిఐ, సిపిఎం నాయకులు వేచలపు కాసుబాబు, గొర్లె దేవుడుబాబు, ఎర్రా దేముడు, ఈర్లి నాయుడుబాబు, రెడ్డి అప్పలనాయుడు, దమ్ము ముత్యాలనాయుడు, వర్రి అప్పారావు, కోటి, గాడి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని సిరసపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ధర్నా నిర్వహించారు. స్థానిక మెయిన్ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. సిపిఎం నాయకులు వివి.శ్రీనివాసరావు, ఎస్.బ్రహ్మజీ, ఆళ్ల మహేశ్వరరావు, ఆళ్ల సూరిబాబు, కాండ్రేగుల రాము, మహేష్, గోపి, సంజీవరావు, వేగి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పరవాడ : పరవాడ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం వివి.రమణ, పిడి నాయుడు. లోహిత, వెంకటరమణ, గనిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
రాంబిల్లి : రాంబిల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం మండల కార్యదర్శి జి.దేముడునాయుడు, ఎం.నారాయణ రావు, సిహెచ్ నూకన్న, వై రాము, సిహెచ్ రామకృష్ణ, డి కాసియా, రాంబాబు, అప్పారావు, వరహాలరావు, చిట్టిబాబు పాల్గొన్నారు.
చోడవరం : వామపక్ష పార్టీల ఆధ్వర్యాన చోడవరం విద్యుత్ సబ్ స్టేషన్ నిరసన తెలిపారు. వామపక్ష నాయకులు పైలా రమేష్, కిల్లి దేముడు, రెడ్డి లక్ష్మి, ఐతిరెడ్డి అప్పలనాయుడు, గోవాడ కనక మహాలక్ష్మి, ఆబోతుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
దేవరాపల్లి : సిపిఎం ఆధ్వర్యాన స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న, మండల కార్యదర్శి బిటి దొర, వినియోగదారులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కర్రి అప్పారావు, ఆర్.రాము, కె.సోమినాయుడు, గనగల నూకరాజు, బుద్ధ రంగారావు, సన్యాసిరావు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్: ప్రజలపై అదనపు విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలని నర్సీపట్నంలో సిపిఐ, సిపిఎం, ఇతర అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా చేపట్టారు. పెద్ద బొడ్డేపల్లి కూడలి నుండి ర్యాలీ ప్రారంభించి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ఎస్‌సీ, ఎస్టిలకు సబ్సిడీ విద్యుత్ అందించాలని నినాదాలు చేస్తూ విద్యుత్ డివిజనల్ కార్యాలయంకు చేరుకుని ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సబ్యులు అడిగర్ల రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విదానాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి భుజానికి ఎత్తుకొని విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తున్నారన్నారు. ఇందులో బాగంగా కరెంటు చార్జీలు మోత మోగిస్తున్నారన్నారు.
పిసిసి సభ్యులు మీసాల సుబ్బన్న మాట్లాడుతూ, పెంచిన విద్యుత్ చార్జీల పై వామపక్షాల పోరాటానికి కాంగ్రీస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. సిపిఎం నాయకులు ఈరెల్లి చిరంజీవి మట్లాడుతూ, అదానికి లాబాలు పెంచేందుకు జగన్‌మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు తీసుకోస్తున్నారని విమర్శించారు.ఎఐటియుసి రాష్ట్ర సమీతి నాయకులు ఎల్‌వి రమణ మాట్లాడుతూ, ప్రజలు సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సాపిరెడ్డి నారాయణముర్తి, ఎల్.గౌరీ, కెవీ సూర్యప్రభ, డి.శివ, సిపిఐ నర్సీపట్నం టౌన్ కార్యదర్శి జి.గురుబాబు, ఎస్.కొండలరావు వ్యావసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మేకా సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు, జి.మాణిక్యం తదిరులు పాల్గొన్నారు.
కొత్తకోట:పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తకోట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యలు కె.గోవింద్ రావు, సీపీఐ మండల కార్య దర్శి జి.జోగిరాజు మాట్లాడుతూ, సర్దుబాటు చార్జీలంటూ ప్రజలపై మోపుతున్న బారాన్ని రద్దు చేయాలన్నారు. అనధికార విద్యుత్ కోతలు సరి చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలలు పి.రమణమ్మ, పలువురు యువకులు పాల్గొన్నారు
ఎస్.రాయవరం ::మండలంలో పీ. ధర్మవరం సబ్ స్టేషన్ వద్ద సిపిఎం మండల నాయకులు మామిడి నానాజీ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు.
పాయకరావుపేట:స్థానిక ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగత శ్రీనివాస్, సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యురాలు బందుల సుబ్బలక్ష్మి, పాయకరావుపేట మండల కార్యదర్శి వెలుగుల అర్జున్ రావు, చీడిపల్లి చక్రవర్తి, దార్ల సూర్య ప్రకాశరావు పాల్గొన్నారు.
సీతమ్మధార : కేవలం రూ.ఏడు వేలకోట్ల అదనపు రుణాల కోసం కేంద్ర విద్యుత్ సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం దుర్మార్గమని, అందుకే వినియోగదారులపై ఛార్జీల భారం మోపుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపండారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, స్మార్ట్‌మీటర్లు రద్దుచేయాలని డిమాండ్‌తో 10 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త ధర్నాలో భాగంగాసీతమ్మధార ఎపిఇపిడిసిఎల్ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పెద్దఎత్తున నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు భారాలు లేని పాలన అందిస్తామని నమ్మబలికిన సిఎం జగన్మోహనరెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడా ఛార్జీలు, పన్నులు, ధరల భారం మోపడం దుర్మార్గమన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, 78వవార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ రాబోయే కాలంలో రాష్ట్రంలో రెగ్యులరేటరీ కమిషన్ లేకుండా చేయడానికి ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నారని, ప్రభుత్వ కంపెనీలను అదానీ, అంబానీ, హిందూజా కంపెనీలుగా మార్చడమే జగన్, మోడీ లక్ష్యమని ఎద్దేవా చేశారు.
సిపిఐ(ఎంఎల్) న్యూడెమెక్రసీ రాష్ట్ర నాయకురాలు లక్ష్మి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యన్నారాయణ మూర్తి, జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, విమల, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.మణి, బి.వెంకటరావు, ఎం.సుబ్బారావు, నరేంద్రకుమార్, అప్పలరాజు, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వై.కొండయ్య, సిపిఐ నాయకులు చంద్రశేఖర్, మన్మధరావు పాల్గొన్నారు.
పెందుర్తి : విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెందుర్తి సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్ మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మోడీ అడుగులకు మడుగులొత్తుతున్న జగన్మోహనరెడ్డికి బుద్ధి చెప్పేేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు మాట్లాడారు.సిపిఎం జోన్ కార్యదర్శి బి రమణి సిఐటియు నాయకులు అప్పలనాయుడు సూర్య ప్రకాష్ మౌలాలి, శంకరరావు, పౌ సంఘ సభ్యురాలు ఇందిర, సిఐటియు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు
గాజువాక : విద్యుత్ భారాలకు నిరసనగా ఆటోనగర్ సబ్‌స్టేషన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పిబివిఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, ఉచిత విద్యుత్ అంటూనే నాలుగేళ్లలో రూ.25వేల కోట్ల భారం వేయడం దుర్మార్గమన్నారు. సిపిఐ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడారు. సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కు తగ్గేవరకు బషీరాబాగ్ స్ఫూర్తితో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. సిపిఐ నాయకులు పోలయ్య, ఆనందరావు సిపిఎం నేతలు జె శ్రీలక్ష్మి, వై లక్ష్మణరావు, ఎ.లోకేష్, డి రమణ, బి అప్పారావు, డి అప్పారావు, సింహాచలం, గొలగాని అప్పారావు, కెపి.కుమార్, ఒవి రావు, కె.శ్రీనివాస్, నమ్మి రమణ, బి గొరప్ప మాట్లాడారు.
తగరపువలస : విద్యుత్ ఛార్జీల భారాన్ని తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన చిట్టివలస విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.ఎఇ రవికి వినతి పత్రం అందజేశారు, కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, ఎస్ అప్పలనాయుడు, భాగం లక్ష్మి, మాజీ కౌన్సిలర్ టి సోమరాజు, సోమి వెంకట్ పాల్గొన్నారు.