
- వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహణ
ప్రజాశక్తి-చల్లపల్లి: విద్యుత్ భారాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై సోమవారం స్థానిక సంత బజారు బజార్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. మొత్తం 650 మందికి ప్రజా బ్యాలెట్‌లో పాల్గొనగా 644 విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, ఆరుగురు అనుకూలంగా విద్యుత్ ఛార్జీలపై తమ స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు భారం మోపిందని విమర్శించారు. ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటలు రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రకరకాల పేర్లతో ప్రజలను మభ్యపెట్టి విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి యద్దనపూడి మధు, మండల కమిటీ సభ్యులు మహమ్మద్ కరీముల్లా, బండారు కోటీశ్వరావు, లంకపల్లి సత్యం, మేడేపల్లి వెంకటేశ్వరరావు, గోళ్ల సాంబశివరావు, బళ్ల వెంకటేశ్వరరావు, వాకా రామచంద్రరావు, సిపిఐ జిల్లా ఉపాధ్యక్షులు అడ్డాడ ప్రసాద్, జిల్లా నాయకులు హనుమాన్ల సురేంద్రనాథ్ బెనర్జీ, మాలెంపాటి వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు మిక్కినేని మధు, ఎంపీటీసీ సభ్యులు మాలెంపాటి శ్రీనివాసరావు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ నభీ గోరి, నాయకులు వేముల చిన్న, విశ్రాంత ప్రిన్సిపల్ రామారావు తదితరులు పాల్గొన్నారు.