
ప్రజాశక్తి-తిరువూరు: విద్యుత్ వినియోగదారులపై మోపుతున్న అదనపు భారాలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం తిరు వూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విని యోగదారులు తిరువూరు బోసుబొ మ్మ సెంటర్లో గురువారం ధర్నా నిర్వహించారు. ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో, ఏరియస్ పేరుతో, సర్దుబాటు పేరు తో రాష్ట్ర ప్రభుత్వం గహ విద్యుత్ వినియోగదారులపై మోపుతున్న అదనపు కరెంట్ చార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం.నాగేంద్ర ప్రసాద్, మండల కార్యదర్శి సాంబారు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు గుళ్లపల్లి వెంకటరత్నం, నాయకులు పంతంగి శ్రీనివాసరావు, బి.వేంకటేశ్వరరావు, ఆకుల రవి, కడిమి పాపారావు, నాగులమీరా, పాకాల రామకృష్ణ, కె.రాము, ఎం.నర సింహారావు, కె.వి.రత్నం, చప్పిడి సురేష్, జెట్టి శ్రీనివా సరవు, చెరుకు మోహన్‌కృష్ణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.