
- మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వామపక్షాల ధర్నా
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా): పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇంధన సర్దుబాటు చార్జీలు చార్జీల పేరుతో గత నాలుగు సంవత్సరాల 25 వేల కోట్ల రూపాయలు భారం వినియోగదారులపై వేసిందన్నారు. 2014 నుండి వినియోగదారులు వినియోగించుకున్న కరెంటుకు ఆనాడు బిల్లులు కట్టినా, 2,900 కోట్లు లోటు వచ్చిందని జనం నుండి 36 నెలల పాటు వసూలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా అనుమతి పొందడం జరిగిందన్నారు. ఇటువంటి విధానం ఏ సరుకుకి ప్రపంచంలో ఈ పద్ధతి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ సవరణ బిల్లు వల్ల రాష్ట్రంలో దళితులకు పేదలకు అందుకున్న విద్యుత్తు సబ్సిడీలు పూర్తిగా రద్దు అవుతాయని, వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ కూడా మాయమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మల్ స్టేషన్లో ఉత్పత్తి చేసే విద్యుత్ కు కార్పోరేట్ కంపెనీ నుంచి కచ్చితంగా 20 శాతం విదేశీ బొగ్గు వాడాలని షరతులు పెట్టటం దుర్మార్గమన్నారు సిపిఐ కృష్ణాజిల్లా ఇన్చార్జి కార్యదర్శి టి.తాతయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ట్రు ఆప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు విద్యుత్ సుంఖం పేరుతో ప్రజలపై ఎడాపెడా చార్జీల మాత మోగిస్తుందని, ప్రజలపై వేసే ఈ భారాలు వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2004 నుండి 2014 వరకు గత ప్రభుత్వం పెరిగిన యూనిట్ ధర వల్ల 28,835 కోట్లు అదనపు భారం వేసిందన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి వి.జ్యోతి మాట్లాడుతూ ప్రజలు ప్రత్యక్షంగా కట్టే బిల్లులే కాకుండా పంచాయతీ మున్సిపాలిటీలకు కరెంట్ బిల్లులు పెరిగిన పరోక్షంగా జనం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వీటన్నిటికీ ముఖ్య కారణం విద్యుత్ సంస్కరణలే అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ రఘు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి అందించే విద్యుత్తు మొత్తం 30 సంవత్సరాల పాటు అదాని కంపెనీ సరఫరా చేసే విధంగా ఒప్పందం జరిగిందని విద్యుత్ స్మార్ట్ మీటర్లు తయారు చేసే సంస్థలను ప్రారంభించడం జరిగిందని ఈ నిర్ణయాల వల్ల అదానీ అంబానీలకు దోచిపెట్టడం, ప్రజలపై భారాల వేయటం ఈ ప్రభుత్వం యొక్క విధానాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మచిలీపట్నం నగర కార్యదర్శి బి.సుబ్రమణ్యం, సిపిఐ మచిలీపట్నం నియోజకవర్గం కార్యదర్శి లింగం ఫిలిప్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌సిపి రెడ్డి, కల్లం వెంకటేశ్వరరావు, లక్ష్మణ స్వామి, నాగేంద్రం, జిల్లా నాయకులు బేతా శ్రీనివాసరావు, మాజేటి శ్రీనివాసరావు, టీ నరేష్, మూర్తి, ఎస్ నారాయణ, వై మధు, కరీముల్లా, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ధనశ్రీ, కౌలు రైతు సంఘం నాయకులు పి.రంగారావు, రాజేష్, కే శర్మ, సీనియర్ నాయకులు ఎస్ ధనుంజయరావు, సిహెచ్ జయరావు సిపిఐ నాయకులు విజరు కుమార్, గూడపాటి ప్రకాష్, కొండయ్య, నాగేశ్వరరావు, ఐద్వా మచిలీపట్నం కార్యదర్శి కే సుజాత తదితరులు పాల్గొన్నారు.