
రాయచోటి టౌన్; విద్యుత్ ఛార్జీల పెంపుదలను, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ నెల 27న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహి స్తున్నట్లు వామపక్ష పార్టీలు పిలుపు నిచ్చాయి. శుక్రవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాల యంలో నిర్వహించిన వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్.నరసింహులు, సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు యం.విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. ప్రభుత్వం విధిస్తున్న కోతలతో ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు పెద్ద కుంభ కోణమని, వాటిని బిగించడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ ఎనర్జీ, హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో భూములు లాగేసుకుంటూ రైతులను భూమిలేని వారిని చేస్తున్నారని, ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ ఫెయిల్యూరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు ఛార్జీలు పెంచారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టబోమని కేంద్ర ప్రభుత్వానికి తెగేసి చెబితే జగన్ ప్రభుత్వం ప్రధాన మంత్రి మోడీ చెప్పినట్లు చెస్తున్నారన్నారు. చండీగఢ్ ప్రభుత్వం ఒక్కో స్మార్ట్ మీటర్ రూ.7,500 కొంటే జగన్ ప్రభుత్వం మాత్రం ఒక్కొక్కటీ రూ.32 వేలకు కొనుగోలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను రైతు సంఘాలు పోరాడి తిప్పి కొట్టాయని అన్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌పై రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రం చట్టాలు చేస్తోందని, ఇది న్యాయసమ్మతం కాదని తెలిపారు. అదానీ కంపెనీ సంపదలను పెంచేందుకే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని
తెలిపారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే విద్యుత్ సంస్కరణల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రాణాలను పీల్చిపిప్పి చేస్తోందని తెలిపారు. పోరాటాల ద్వారానే వాటిని తిప్పికొట్టాలని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా, కేవలం వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇస్తూ, ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యమాలు చేసుకునే స్వేఛ కూడా లేదన్నారు. ప్రభుత్వ విధానాల గురించి ఇంటింటి క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. దళితులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదని, వారికి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని కోరారు. 75 యూనిట్లు దాటితే మొత్తానికి బిల్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరిగే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఎ.రామాంజులు, సి.రవికుమార్, వెంకట్రామయ్య, సిపిఐ జిల్లా నాయకులు రంగారెడ్డి, సుధీర్, ఐఎఫ్‌టియు నాయకులు రమణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి- కడప అర్బన్
విద్యుత్ ఛార్జీ పెంపుదలను, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని నిరసిస్తూ ఈనెల 27న కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు పెంచారన్నారు. విద్యుత్‌ఛార్జీల పెంపుతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిశ్రమలు మూతపడుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు, ఇళ్లకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు పెద్ద కుంభకోణమని, బిగించడం వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టబోమని కేంద్ర ప్రభుత్వానికి తెగేసి చెబిత, ే జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదానితో సహా వివిధ కార్పొరేట్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక, ప్రమాదకర ఒప్పందాలు చేసుకుంటూ ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విద్యుత్ ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు, విద్యుత్ సుంకం రద్దు చేయాలని, వడ్డీ భారాన్ని వినియోగదారులపై వేసే ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమ తరహాలో రాష్ట్రంలో ఉద్యమానికి ప్రజలు సమాయత్తం కావాలన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలని, ప్రయివేటీకరణను విడనాడాలని, స్మార్ట్ మీటర్లను బిగించొద్దని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వి. సుబ్బారెడ్డి, సి. సుబ్రహ్మణ్యం, ఓబయ్య, సిపిఎం నాయకులు బెల్లం మనోహర్, చంద్రారెడ్డి, డి.ఎం. ఓబులేష్ పాల్గొన్నారు.విద్యుత్ భారాలకు..
(మొదటిపేజీతరువాయి) తెలిపారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే విద్యుత్ సంస్కరణల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రాణాలను పీల్చిపిప్పి చేస్తోందని తెలిపారు. పోరాటాల ద్వారానే వాటిని తిప్పికొట్టాలని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా, కేవలం వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇస్తూ, ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యమాలు చేసుకునే స్వేఛ కూడా లేదన్నారు. ప్రభుత్వ విధానాల గురించి ఇంటింటి క్యాంపెయిన్ నిర్వహి ంచాలన్నారు. కలెక్టర్ కార్యా లయం ఎదుట ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఎ.రామాంజులు, సి.రవికుమార్, వెంకట్రామయ్య, సిపిఐ జిల్లా నాయకులు రంగారెడ్డి, సుధీర్, ఐఎఫ్‌టియు నాయకులు రమణ పాల్గొన్నారు.
కడప అర్బన్ : విద్యుత్ ఛార్జీ పెంపుదలను, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని నిరసిస్తూ ఈనెల 27న కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు పెంచారన్నారు. విద్యుత్‌ఛార్జీల పెంపుతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిశ్రమలు మూత పడుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు, ఇళ్లకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు పెద్ద కుంభకోణమని, బిగించడం వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు, విద్యుత్ సుంకం రద్దు చేయాలని, వడ్డీ భారాన్ని వినియోగదారులపై వేసే ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమ తరహాలో రాష్ట్రంలో ఉద్యమానికి ప్రజలు సమాయత్తం కావాలన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసా గించాలని, ప్రయివేటీకరణను విడనాడాలని, స్మార్ట్ మీటర్లను బిగించొద్దని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వి. సుబ్బారెడ్డి, సి. సుబ్రహ్మణ్యం, ఓబయ్య, సిపిఎం నాయకులు బెల్లం మనోహర్, చంద్రారెడ్డి, డి.ఎం. ఓబులేష్ పాల్గొన్నారు.