
ప్రజాశక్తి-కందుకూరు :విద్యుత్ బిల్లులు షాక్ కొడుతున్నాయని టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 19వ వార్డు బూడి దపాలెంలో పర్యటించారు. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజే యడంతోపాటు పాటు, టిడిపి ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను స్థానికులకు వివరించారు. వైసిపి ప్రభుత్వంలో పెంచిన పన్నులు, చార్జీలను అంకెల రూపంలో విడమర్చి చెప్పారు. ఈ సందర్భంగా మహిళలందరూ తమ ఆవేదనను నాగేశ్వరరావు తో పంచుకున్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షుడు ఉన్నం కష్ణమోహన్, వార్డు నాయకులు సయ్యద్ సుల్తాన్,పిడికిటి రఘనాధరావు, షేక్ ఖాదర్, జానీ బాషా, షేక్ ఆరిఫ్, షేక్ హర్షద్, షేక్ ఆవిద్, గంటా శ్రీకాంత్, దండే ఏడుకొండలు ఉన్నారు.