Aug 29,2023 00:24

మాట్లాడుతున్న సిపిఎం నేత లోకనాథం

ప్రజాశక్తి- అనకాపల్లి
విద్యుత్‌ పోరాట అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వమని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం అన్నారు. విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సభ సోమవారం స్థానిక నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వైజాగ్‌ బస్‌స్టాప్‌ వద్ద నిర్వహించారు. ముందుగా అమరవీరుల చిత్ర పటాలకు లోకనాథం, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, సీనియర్‌ నాయకులు ఎ.బాలకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌ అధ్యక్షతన జరిగిన సభలో లోకనాథం మాట్లాడుతూ పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ 2000 ఆగస్టు 28వ తేదీన వామపక్షాలు చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమం సందర్భంగా బషీర్‌బాగ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అతికిరాతకంగా కాల్పులు జరిపి రామకృష్ణ, విష్ణువర్ధన్‌ రెడ్డి, బాలస్వామి ముగ్గురి ప్రాణాలను బలిగొన్నదని తెలిపారు. ఆ పోరాట ఫలితంగానే తరువాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్‌ ఛార్జీలు పెంచడానికి సాహసించలేదన్నారు. కాని నేటి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిందని, ఇప్పుడు నెలవారీ పెంపుదలకు రంగం సిద్ధం చేస్తుందని విమర్శించారు. విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్వహించడమే విద్యుత్‌ అమర వీరులకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.శంకరరావు, అల్లు రాజు, నాయకులు బి.ఉమామహేశ్వరరావు, కె.ఈశ్వరరావు, కె.సుభాషిణి, బి.నూక అప్పారావు, పి.చలపతి, ఎపి బహుజన దళిత యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ కొల్లి సత్యారావు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌: స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం ఆవరణలో బషీర్‌బాగ్‌ విద్యుత్‌ అమర వీరుల చిత్ర పటాలకు సిపిఎం నాయకులు పూలమాల వేసి నివాళ్ళర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు, నాయకులు ఆళ్ల మహేశ్వరరావు, ఎస్‌.బ్రమ్మాజీ, పెంటకోట సత్యనారాయణ, లోవేశ్వరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : స్థానిక సిఐటియు కార్యాలయంలోనూ, ఎ.కోడూరు గ్రామంలోనూ సిపిఎం నాయకులు విద్యుత్‌ అమరవీరులకు నివాళులర్పించారు. సిపిఎం జిల్లా నాయకులు గండి నాయన బాబు, మండల నాయకులు ఎర్ర దేవుడు, వనం సూర్యనారాయణ, పాల్గొన్నారు.
అచ్యుతాపురం : విద్యుత్‌ అమరవీరుల చిత్ర పటాలకు అచ్యుతాపురంలో కె.సోమునాయుడు, తిమ్మరాజుపేటలో ఎస్‌.రాము నాయుడు పూలమాలలు వేసి నివాళుర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు కర్రి అప్పారావు, బుద్ధ రంగారావు, బి.రాంకుమార్‌, మండల కన్వీనర్‌ ఆర్‌.రాము పాల్గొన్నారు.
వడ్డాది : బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట గ్రామంలో సోమవారం రాత్రి విద్యుత్‌ అమరవీరుల చిత్రపటాలకు సిపిఎం, సిఐటియు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రేమ్‌చంద్రశేఖర్‌, సిపిఎం మండల కన్వీనర్‌ పినపాత్రుని సాంబశివరావు, నాయకులు బత్తుల శ్రీనివాసరావు నానాజీ పాల్గొన్నారు.
పరవాడ : స్థానిక సినిమా హాల్‌ జంక్షన్‌ వద్ద విద్యుత్‌ అమరవీరుల చిత్రపటానికి సిపిఎం నాయకులు కె.నాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, బి.శీను, రమణ, కార్మికులు పాల్గొన్నారు.
సబ్బవరం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు బిల్లుల సర్దుబాటు చార్జీల భారం వెంటనే తగ్గించాలని రాష్ట్ర ఐద్వా అధ్యక్షురాలు బి. ప్రభావతి డిమాండ్‌ చేశారు. స్థానిక దుర్గమాంబ ముఠా కలాసీల సంఘం కార్యాలయం ఆవరణలో విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, నాయకులు కె.కోటేశ్వరరావు, మొల్లేటి గౌరీశ్వరరావు, ముఠా సంఘం నాయకుడు బర్ల రమణ, కార్మికులు పాల్గొన్నారు.
కశింకోట : విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా కశింకోటలో సిఐటియు, ఐద్వా ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్‌ బిల్లులు తగులబెట్టి నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు దాకరపు శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా నాయకులు డిడి వరలక్ష్మి, వినియోగందారులు పాల్గొన్నారు.
నక్కపల్లి : విద్యుత్‌ అమరుల త్యాగాలు వృధా కాన్నివ్వబోమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు తెలిపారు. స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద బషీర్‌బాగ్‌ విద్యుత్‌ అమర వీరుల సంస్మరణ సభ నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. సిపిఎం నాయకులు ఎం.రాజేష్‌, మహేష్‌ బాబు ,అప్పలరాజు, జీ.రమణ, నూకరాజు, పి.వెంకన్న, కె.సత్యనారాయణ, పి.రాబర్ట్‌ పాల్గొన్నారు.
మాడుగుల : మండలంలోని రామచంద్రా పురంలో అమర వీరుల సంస్మరణ సభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు నరసింహ మూర్తి, కె.భవాని పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ :స్థానిక సిపిఎం కార్యాలయంలో విద్యుత్‌ అమరవీరులకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, ఐద్వా జిల్లా ట్రెజరర్‌ సూర్య ప్రభ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్‌.గౌరీ పాల్గొన్నారు.
అరిలోవ : ఆరిలోవ బిఎన్‌ఆర్‌ నగర్‌లో విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడారు. సిపిఎం ఆరిలోవ జోన్‌ కార్యదర్శి వి. నరేంద్ర కుమార్‌, నాయకులు నాగరాజు, రమణ సూర్యనారాయణ , రాము, నగేష్‌, సంగీతరావు, సన్యాసమ్మ పాల్గొన్నారు.
మాధవధార : విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ దినం ఊర్వశి జంక్షన్‌లో జరిగింది. అమరవీరుల చిత్రపటానికి సిపిఎం జోన్‌ కార్యదర్శి బొట్టా ఈశ్వరమ్మ పూలమాలవేసి నివాలర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. పద్మ ఒమ్మి అప్పారావు, ఎం ఈశ్వరరావు, ఎస్‌.శ్రావణ్‌, సిహెచ్‌ సుమిత్ర, ఎ.పుష్ప, పి. వెంకట్రావు, ఎస్‌. సోమేశ్వరరావు, నరసింగరావు, డి.ప్రకాష్‌ బి.సింహాచలం, పి.భానుమూర్తి పాల్గొన్నారు.
గాజువాక: బషీర్‌బాగ్‌ విద్యుత్‌ పోరాటంలో అమరులకు సిపిఎం గాజువాక జోన్‌ కమిటీ నివాళులర్పించింది. సిపిఎం జోన్‌ కార్యదర్శి ఎం .రాంబాబు మాట్లాడారు. కార్యక్రమంలో జోన్‌ కమిటీ నాయకులు జి లక్ష్మి, ఎం శ్రీదేవి, అన్నపూర్ణ పావని, వనజ, సత్యనారాయణ పాల్గొన్నారు
పెందుర్తి : స్థానిక సిఐటియు కార్యాలయంలో బషీర్‌బాగ్‌ విద్యుత్‌ అమరవీరుల చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్‌ పూలమాలవేసి నివాలర్పించారు సిపిఎం జోన్‌ కార్యదర్శి బి రమణి, నాయకులు సూర్య ప్రకాష్‌, మౌలాలి, ఇంగ్లీష్‌ రమణ, శంకరరావు, అప్పలనాయుడు, రజిని పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ : జివిఎంసి 18వ వార్డు మున్సిపల్‌ కార్యాలయం వద్ద, అంజయ్యనగర్‌లో జరిగిన కార్యక్రమంలో సిపిఎం మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు మాట్లాడారు. తొలుత విద్యుత్‌ అమరవీరుల చిత్రపటానికి సిఐటియు నాయకులు జెఆర్‌.నాయుడు, ఎన్‌వి.రమణలు పూలమాల వేసి నివాళ్లర్పించారు. నాయకులు కోదండ, చంటి, సంతోష్‌, గీత, సరోజిని, మున్సిపల్‌ నాయకులు శ్రీదేవి, కొండమ్మ, రఘు పాల్గొన్నారు.
గోపాలపట్నం : స్థానిక సిఐటియు కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం గోపాలపట్నం జోన్‌ కార్యదర్శి బలివాడ వెంకటరావు, సిపిఎం, సిఐటియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ములగాడ : విద్యుత్‌ అమరవీరుల స్ఫూర్తితో కరెంట్‌ ఛార్జీల భారంపై ఉవ్వెత్తున ఉద్యమిద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు పిలుపునిచ్చారు. సోమవారం సిపిఎం మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన 63వవార్డు క్రాంతినగర్‌లో బషీర్‌బాగ్‌ విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. విద్యుత్‌ అమరవీరుల చిత్రపటాలకు క్రాంతినగర్‌ గ్రామకమిటీ అధ్యక్షుడు పరదేశినాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతూ సంస్కరణ పేరుతో సిఎం జగన్‌ విద్యుత్‌ ఛార్జీలను పెంచేస్తున్నారని తెలిపారు. మల్కాపురం జోన్‌ పరిధిలో జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు, నాయకులు కె. పెంటారావు, ఆర్‌.లక్ష్మణమూర్తి, పిసిని రామారావు ఆధ్వర్యాన 58వవార్డు గుల్లలపాలెం, 59వవార్డు నెహ్రునగర్‌ , 61వ వార్డు మల్కాపురం, 62వ వార్డు త్రినాధపురం, దుర్గానగర్‌, ఎఎస్‌ఆర్‌ కాలనీ, 63వ వార్డు చింతల్లోవల్లో సంస్మరణ సభలు జరిగాయి. కార్యక్రమంలో కె.నూకరాజు, బి.మమత, నిర్మల, పివి భాస్కరరావు, నరేష,్‌ వాసు, వై.గంగాధర్‌, రాజేష్‌, యు.రాజారావు, ఆర్‌ విమల, వి.బాబురావు, ఎన్‌ మ, ఎల్‌.కృష్ణ,అర్జునరావు, గణేష్‌, ఎ.రమణ, సత్తిబాబు, నీలయ్య, రాజు పాల్గొన్నారు.