Aug 29,2023 00:32

చీరలు ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:విద్యుత్‌ అమరవీరుల స్పూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్ర పిలుపునిచ్చారు. సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో విద్యుత్‌ అమరవీరుల చిత్రపటాలను పూల మాలలు వేసి ఘనంగా నివాలర్పించారు. ఈ సందర్భంగా సురేంద్ర, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, బసిర్బాగ్‌ లో నిర్వహించిన విద్యుత్‌ పోరాటంలో పోలీసు కాల్పుల్లో రామకృష్ణ, రామస్వామి ప్రాణాలు విడిచారన్నారు. గిరిజనులకు వంద శాతం ఉద్యోగాలు కల్పించే జీఓ 3 పునరుద్ధరణ చేయాలని చెప్పారు. నిరుద్యోగం, అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్‌ 4 వరకు జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం నిరుగ్యోగ సమస్య పరిష్కారం, ధరలు అదుపు చేయడంలో ఘోరంగా విపలం చెందిందని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. సెప్టెంబర్‌ 4 వరకు జరిగే పోరాటంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కె.మగ్గన్న, కెజగన్నాధం పాల్గొన్నారు.
పాడేరు: ట్రూ అప్‌ చార్జీల పేరుతో విద్యుత్‌ చార్జీల బాదుడిపై ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. చింతపల్లి మండల కేంద్రంలో విద్యుత్‌ అమరవీరులకు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మహిళలు కార్మికులు ఘనంగా నివాళులర్పించారు.స్మార్ట్‌ మీటర్ల పేరుతో ప్రజలపై మరో భారీ దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని, దీనిపై ప్రజలు తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పంకి ధనంజరు, సిఐటియు, అంగన్వాడి కార్యకర్తలు పెంటమ్మ, రాజేశ్వరి, సత్యవతి, రాజేశ్వరి పాల్గొన్నారు.