Jul 28,2022 23:31

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి

భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి
ప్రజాశక్తి -ఆనందపురం:
విద్యుత్‌ ఆదాతో భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఉజ్వల భారత్‌, ఉజ్వల భవిష్యత్తు, విద్యుత్‌ 2047' కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సాంప్రదాయ సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను అందించిన ఘనత దేశంలో ఒక్క మన రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్‌ సుభద్ర, ట్రాన్స్‌కో ఎస్‌ఇ ఎంబి సురేష్‌కుమార్‌, ప్రాజెెక్ట్‌ డైరెక్టర్‌ బి రమేష్‌ ప్రసాద్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వి.విజరులలిత, ఎఇ సురేష్‌కుమార్‌, ఎంపిపి మజ్జి ప్రియాంకశారద, వైస్‌ ఎంపిపి పాండ్రంకి శ్రీని, వైసిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకటరావు, ఆనందపురం,పద్మనాభం, భీమిలి ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, విద్యుత్‌శాఖాధికారులు పాల్గొన్నారు.