Jul 11,2023 21:51

విద్యుత్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

 రాయచోటి : ప్రత్యేక అదాలత్‌ను విద్యుత్‌ వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్‌శాఖ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక విద్యుత్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14న రాయచోటి విద్యుత్‌ శాఖ కార్యాలయ ఆవరణంలో విద్యుత్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ఉదయం 11-30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాయచోటి విద్యుత్‌ శాఖ పరిధిలోని సంబేపల్లె, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, టి.సుండుపల్లె, రాయచోటి ప్రాంతాలకు చెందిన విద్యుత్‌ వినియోగ దారులు పాల్గొనవచ్చుని చెప్పారు. చైర్మన్‌ రామమోహన్‌ రావు, టెక్నికల్‌ ప్రెసిడెంట్‌అంజన్‌ కుమార్‌, గౌరవ సభ్యులుగా జి.ఈశ్వరమ్మలు పాల్గొంటారని వివరించారు. విద్యుత్‌ వినియోగంలో తమ సమస్యలు ఏవైనా ఉంటే కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవచ్చుని తెలిపారు. వినియోగదారుల సమస్యలపై కొన్ని అక్కడిక్కడే, మరికొన్ని ఆయాశాఖ అధికారుల ద్వారా పరిష్కరిస్తామని తెలియచేశారు. విద్యుత్‌ శాఖ ఎడిలు, ఎఇలు, లైన్‌మెన్లతో సమావేశం నిర్వహించి పేరుకపోయిన పాత బకాయీల వసూళ్లపై ప్రత్యేక దష్టి పెట్టాన్నారు. శాఖ ఎడిలు, ఎఇలు, లైన్‌మెటన్లు పాల్గొన్నారు.అధికారులతో మాట్లాడుతున్న ఇఇ చంద్రశేఖర్‌రెడ్డి