Sep 13,2022 22:18

మృతిచెందిన గౌరి

ప్రజాశక్తి-ఆనందపురం : ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మంగళవారం మృతిచెందింది. తర్లువాడ గ్రామానికి చెందిన సిమ్మ గౌరి (29) మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఉతికిన బట్టలు ఆరబెట్టడానికి మెడపైకి వెళ్లారు. బట్టలు ఆరబెడుతుండగా పైన ఉన్న విద్యుత్‌ వైర్లు తగిలడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. గౌరికి భర్త అప్పారావు, పిల్లలు స్వాతి (8), హేమంత్‌ (5) ఉన్నారు. మృతురాలి మామ సిమ్మ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఎస్‌ఐ నరసింహమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.