కాలిపోయిన కళ్యాణి బిర్యాని హోటల్
ప్రజాశక్తి - దేవనకొండ
దేవనకొండ భారత్ పెట్రోలు బంకుకు ఎదురుగా ఉన్న కళ్యాణి బిర్యాని హోటల్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దగ్ధమైంది. బాధితునికి రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి... మండలంలోని అలారుదిన్నె గ్రామానికి చెందిన హరిజన నరసన్న గత కొన్నేళ్లుగా కళ్యాణి బిర్యాని హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. గురువారం విద్యుదాఘాతంతో మంటలు వ్యాప్తి చెంది హోటల్ పైకప్పు, అందులోని వస్తు సామగ్రి, సరుకులు కాలిపోయాయి. పత్తికొండ అగ్నిమాప కేంద్రానికి సమాచారం అందించగా ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదంతో నష్టపోయిన తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు నరసన్న కోరారు.










