వీరఘట్టం: మండలం కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన గురాన శ్రీనివాసరావు జెఎల్‌ఎంగా విధులు నిర్వహిస్తూ విద్యుదా ఘాతానికి గురై తీవ్ర గాయాల య్యాయి. మండలంలో గడగమ్మ సమీపంలో సోమవారం విద్యుత్ స్తంభాన్ని అమర్చేం దుకు జి.శ్రీనివాసరావు నలుగురు కూలీలను వెంటబెట్టుకుని స్తంభం కూలిన చోట కొత్త స్తంభం ఏర్పాటు చేసేందుకు అక్కడకు చేరుకున్నారు. వారం రోజుల క్రితం విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో బిటివాడ ఫీడర్ నుంచి చిదిమి, గడగమ్మ, కొట్టుగుమ్మడ, కిమ్మి గ్రామాలకు విద్యుత్ సరఫరా అయ్యేది. ఇది నేలకొరగడంతో ఆ సెక్షన్‌ను నిలుపుదల చేసి కడకెల్ల ఫీడర్ నుంచి సఫ్లె ఇచ్చారు. లైన్ సఫ్లె నిలుపుదల చేయాలని సమాచారం ఇవ్వడంతో వైర్లు కట్ చేస్తుండగా మిగిలిన వైర్లు కాలుకు తగాయి. దీంతో ఆయన కేకలు వేయంతో పక్కనే ఉన్న కూలీలు వచ్చి చూసేసరికి శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయమై తోటి ఉద్యోగి మజ్జి కృష్ణంరాజుకు స్థానిక సబ్ స్టేషన్‌కు పలుమార్లుఫోన్ చేసినా స్పందించలేదు. అధికారుల నిర్లక్ష్యం వలే ఈ ప్రమాదం జరిగిందని గడగమ్మ, కొట్టుగుమ్మడ గ్రామస్తులు స్థానిక సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళన చేయడంతో మండల మంతా మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. తీవ్రగాయాలైన శ్రీనివాసరావును పాలకొండ వరకు తరలించి అక్కడ ప్రథమ చికిత్స అందించి విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. జరిగిన ఘటనకు సంబంధించి ఎఇ సమాధానం చెప్పాలని గ్రామస్తులు పట్టుపట్టడంతో ఎఇ బాలాజీ, ఎడి మోహన్‌చక్రవర్తి, స్థానిక ఎస్‌ఐ ఎం.వెంకట రమణ, జిఎంవలస ఎస్‌ఐ పి.అవినాష్ సబ్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి సర్థిచెప్పడం తో విద్యుత్‌ను పునరుద్దరించారు. వారికి అధికారులు భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.










