ప్రజాశక్తి-ఉరవకొండ నేటి విద్యార్థులు విద్యతోపాటు ప్రావీణ్యం ఉన్న క్రీడల్లో రాణించాలని ఖోఖో క్రీడాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉరవకొండలోని ఎస్.కె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ఖోఖో జూనియర్ క్రీడా విభాగంలో బాల బాలికలకు క్రీడాపోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో 250 మంది పాల్గొనగా అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లాస్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఈనెల 19న చిత్తూరు జిల్లా యాదమరిలో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జూనియర్ బాలుర విభాగంలో ఆమిద్యాల వీరశేఖర్, హరికృష్ణ, మోపిడి మహేంద్ర, వంశీ, ఉరవకొండ గౌతమ్, అజరుకుమార్, సుదర్శన్, అనంతపురం అనిల్‌కుమార్, నాగలాపురం అంజి, మహేంద్ర, లోకేష్, కొండాపురం గణేష్, గుంతకల్లు అభిషేక్‌ను ఎంపిక చేశారు. అదేవిధంగా జూనియర్ బాలికల విభాగంలో నాగలాపురం కె.సంధ్య, స్వప్న, హారిక, మౌనిక, రితిష్య, సోనిక, ఉరవకొండ శ్రావణి, చైతన్య, ధనలక్ష్మి, ఆమిద్యాల సునీత, మోపిడి ఐశ్వర్య, శాంతి, గుంతకల్లు సంధ్య, అనంతపురం రషీదాను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మారుతీ ప్రసాద్, రాజేష్, రాంభూపాల్, ప్రభాకర్, మంజునాథ్, జనార్ధన్, రాఘవేంద్ర, సురేష్, మాధవి, శర్మస్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో అతిథులు










