ప్రజాశక్తి - చీరాల
విద్యార్థులందరూ కష్టపడి చదువుకుంటూ జీవితంలో రాణించాలని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. మండలంలోని ఈపురిపాలెం స్ట్రైట్ కట్ వద్ద కస్తూరిభా బాలికల వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈసందర్భంగా హాస్టల్ నిర్వాహకులు, ఉపాధ్యాయ సిబ్బంది ఎమ్మెల్సీ సునీతను సన్మానించారు.










