ప్రజాశక్తి - కౌతాళం
ప్రతి విద్యార్థికీ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోగలరని ప్రతిభ హై స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ దూద్ బాషా తెలిపారు. గత ఏప్రిల్‌లో రైజింగ్ నాలెడ్జ్ అబాకాస్ ఒలంపియాడ్ ఆదోనిలో నిర్వహించిన డివిజన్ స్థాయి అబాకాస్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన 3, 4, 5వ తరగతి విద్యార్థులకు మొదటి, ద్వితీయ ర్యాంకులను సాధించిన వారిని సోమవారం పాఠశాల యాజమాన్యం అభినందించి మెడల్స్, ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ సయ్యద్ మైనుద్దీన్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిలో నైపుణ్యం ఉంటుందని, క్రమశిక్షణ, నైతిక విలువలతో సరైన మార్గంలో వెళ్లినప్పుడే విద్యార్థులు అనుకునేది సాధించగలరని తెలిపారు. అప్పుడే భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగగలరని చిన్నారులకు అర్థమయ్యే విధంగా సూచించారు. ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వరి, గణిత ఉపాధ్యాయులు జయలక్ష్మి, రామలక్ష్మి, జ్ఞానేశ్వరి, భీమేష్, పరమేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మెడల్స్ అందిస్తున్న కరస్పాండెంట్










