కడప : విద్యతోనే సమాజాభివద్ది సాధ్యమవుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏ మాత్రం ఆర్థిక భారం కాకూడదని 'జగనన్న విద్యా దీవెన' పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ కేంద్రం బహిరంగ సభ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2022- 23 విద్యా సంవత్సరానికి సంబంధించి 3వ విడత 'జగనన్న విద్యా దీవెన''లబ్ది మొత్తాన్ని ల్యాప్ టాప్ బటన్ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేశారు. కార్యక్రమానికి కడప కలెక్టరేట్ విసి హాలు నుంచి కలెక్టర్‌తోపాటు ఎపి హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్, రాష్ట్ర పీఆర్ శాఖ సలహాదారు నాగార్జున రెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ సలహాదారు పి.శివ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 46,134 మంది విద్యార్థులకు మంజూరైన 'జగనన్న విద్యా దీవెన' లబ్ది మొత్తం రూ. 33,41,00,888ల మెగా చెక్కును విద్యార్థులు, వారి తల్లులకు గౌరవ అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి విద్యా సంబందిత సంక్షేమ పథకాల ఫలాలు అందలన్నదే ముఖ్యమంత్రి. లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతీ, ఎస్‌సి, బిసి కార్పొరేషన్ల ఈడీలు డాక్టర్ వెంకటసుబ్బయ్య, డాక్టర్ వి. బ్రహ్మయ్యలు, మైనార్టీ సంక్షేమాధికారి ఇమ్రాన్, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీస్, బీసీ, ఎస్సి, ఎస్టీ సంక్షేమ శాఖల అధికా రులు, విద్యాశాఖ అధికారులు, జిల్లాలోని పలు డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, నర్సింగ్ ఇతర ప్రొఫైషనల్ కోర్సుల విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.మెగా చెక్కును అందజేస్తున్న కలెక్టర్ విజరురామరాజు










