ప్రజాశక్తి - ఆదోని
విద్యతోనే పురోగతి సాధ్యమని, రాష్ట్రంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయోజిత పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆదోని పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున అధ్యక్షత వహించారు. అంతకుముందు మున్సిపల్ ఛైర్మన్ శాంత జ్యోతి ప్రజ్వలన చేశారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడారు. జగనన్న విద్యాకానుక విద్యార్థులకు, తల్లిదండ్రులకు వరమని తెలిపారు. తన చిన్నతనంలో కొత్త బట్టలు, షూస్ లేకపోవడం లోటుగా అనిపించేదని చెప్పారు. చిన్నతనంలో సహజంగా ఉండే సూక్ష్మమైన విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లేదనే బాధ లేకుండా విద్యార్థులందరికీ సమానంగా అన్నీ ఉండాలనే జగనన్న విద్యాకానుక అందిస్తున్నారని తెలిపారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. కలెక్టర్ జి.సృజన, ఎంపీ సంజీవ్ కుమార్, జడ్‌పి ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, మాట్లాడారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ మజార్ అహ్మద్, వైస్ ఛైర్మన్ తిమ్మప్ప, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరసింహులు, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఇఒ రంగారెడ్డి, ఎపిఒ శ్రీనివాసులు, ఎంఇఒ శివరాం, వైసిపి నాయకులు జయమనోజ్ రెడ్డి, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ నియాజ్ అహ్మద్, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మహబూబ్‌బాషా, జమీల్ షఫీ అహ్మద్, ఉపాధ్యాయులు నాగరాజ్, ప్రహ్లాద, రవి, సిఐలు విక్రమ్ సింహ, పార్థసారథి, ఎస్‌ఐ చంద్ర ఉన్నారు.
విద్యార్థులతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి










