ప్రజాశక్తి - ఎటపాక
విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ప్రతినిధులు అన్నారు. దళిత సంక్షేమ సంఘం సహకారంతో ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ఆధ్వర్యంలో ''మాదిగ పల్లెలను పలకరిందాం'' కార్యక్రమంలో భాగంగా శనివారం పోలవరం ముంపు మాదిగ గ్రామాలను సందర్శించారు. కూనవరం మండలం ఉదయభాస్కర్ కాలనీ, వెంకటాయపాలెం, కాచవరం, ఎటపాక మండలం నెల్లిపాక, చోడవరం, గుండాల కాలనీ గ్రామాలను సందర్శించి మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, వారి జీవన శైలిని పరిశీలించి అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటలెక్చువల్ ఫోర్ మాదిగస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గెడ్డం బాపిరాజు, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, మాదిగ దండోరా నాయకులు గురజాల వెంకటేశ్వర్లు, అగ్నిపర్తి వెంకటేశ్వర్లు, గడ్డం వెంకటేశ్వర్లు, గడ్డం శీను, ములకలపల్లి కిషోర్, గడ్డం బాబు తదితరులు పాల్గొన్నారు.










