Jun 28,2023 00:20

మాట్లాడుతున్న హెచ్‌ఎం



ప్రజాశక్తి- పెదబయలు :స్థానిక గిరిజన ఆశ్రమ వసతి గహం పాఠశాలలో మంగళవారం ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వర్‌రావు అధ్యక్షతన తల్లి దండ్రుల సమావేశం పేరెంట్స్‌ కమిటీ సమక్షం లో నిర్వహించారు ఈ సమావేశం నిద్దేశించి ప్రధాన ఉపాధ్యా యుడు టి నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ, బడి ఈడు పిల్లలను ఇంట్లో ఉంచకుండా బడిలో చేర్పించాలని తెలిపారు. చదువు తోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లి దండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యా యులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.